Headlines

Sachin Joshi : హీరో సచిన్ జోషి గుర్తున్నాడా.. ? ఆయన భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఎవరంటే.. | Did you Remember Actor Sachin Joshi His Wife Also Tollywood Heroine


సినీ పరిశ్రమలోకి ప్రతిరోజూ ఎంతోమంది ఎన్నో ఆశలతో అడుగుపెడుతుంటారు. అందులో కొందరు మాత్రమే వరుస విజయాలతో రాణిస్తే, మరికొందరు అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేక సినిమాలకు దూరమవుతుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరో సచిన్ జోషి ఒకరు. అయితే ఆయన భార్య కూడా ఒకప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను ఏలిన ప్రముఖ హీరోయిన్ అనే విషయం చాలామందికి తెలియదు. ప్రముఖ వ్యాపారవేత్త జె.ఎమ్. జోషి కుమారుడైన సచిన్ జోషి, నటనపై ఉన్న ఆసక్తితో 2002లో ‘మౌనమేలనోయి’ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘నిన్ను చూడక నేనుండలేను’, ‘ఒరేయ్ పండు’ వంటి చిత్రాల్లో హీరోగా నటించారు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు సాధించకపోవడంతో దాదాపు తొమ్మిదేళ్ల పాటు నటనా రంగానికి దూరంగా ఉన్నారు.

తదనంతరం బాలీవుడ్ సూపర్‌హిట్ ‘ఆషికీ 2’ తెలుగు రీమేక్ అయిన ‘నీ జతగా నేనుండాలి’ చిత్రంతో మళ్లీ కథానాయకుడిగా రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని చిత్రాలు, సపోర్టింగ్ రోల్స్ చేసినా లక్ కలసిరాకపోవడంతో నటనకు స్వస్తి చెప్పి వ్యాపారాలపై దృష్టి సారించారు. అలాగే తమన్నాతో ‘నెక్స్ట్ ఏంటి?’ చిత్రాన్ని నిర్మించడంతో పాటు సీసీఎల్‌లో (CCL) టాలీవుడ్ వారియర్స్ జట్టుకు స్పాన్సర్‌గా కూడా వ్యవహరించారు.

వ్యాపారవేత్తగా వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏలుతున్న సచిన్ జోషి, 2012లో ప్రముఖ నటి, మోడల్ ఊర్వశి శర్మను వివాహం చేసుకున్నారు. ఊర్వశి శర్మ 2008లో శేఖర్ సూరి దర్శకత్వంలో వచ్చిన ‘త్రీ’ (Three) సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. బాలీవుడ్‌లో బాబీ డియోల్, అక్షయ్ ఖన్నాలతో కలిసి నటించిన ‘నఖాబ్’ చిత్రంతో ఊర్వశి శర్మ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘ఖట్టా మీఠా’, ‘బాబర్’, ‘ఆక్రోష్’ వంటి ప్రజాదరణ పొందిన హిందీ చిత్రాల్లో నటించారు. వివాహానంతరం ఊర్వశి శర్మ తన పేరును ‘రైనా జోషి’గా మార్చుకుని నటనకు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉంటూ వీరు తమ సొంత వ్యాపారాలను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ సినిమాతోనే నా జీవితం మలుపు తిరిగింది.. ఆయన మూవీ అప్పట్లో సంచలనం.. తనికెళ్ల భరణి.

సచిన్ జోషి ఫ్యామిలీ..

Sachin Joshi, Urvashi

Sachin Joshi, Urvashi

ఎక్కువ మంది చదివినవి : Cinema : సినిమా అంటే ఇది భయ్యా.. ఒక్క దెబ్బతో టాక్సిక్, దురంధర్ చిత్రాలు వెనక్కు.. థియేటర్లను షేక్ చేస్తున్న మూవీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *