తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. తమిళనాడు తీరప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని.. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మున్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, వాయువ్య దిశగా గాలులు వీయడంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తాయని తెలిపింది.
ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్,యానాంలో వర్షాలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని. అలాగే కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షికోస్తా, రాయలసీమలో కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని స్పష్టం చేసింది.
తెలంగాణలో వాతావరణం
దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో ఇటు తెలంగాణలోనూ ఈరోజు కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక శని, ఆదివారాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది స్వల్ప ఊరటనివ్వనుందని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.