Headlines

తమిళ సినిమా కోసం.. లైఫ్ ని రిస్క్ లో పెట్టాడు.. | Suhas Risks His Life for Tamil Film Mandadi: Actor Reveals Shocking 45 Day Sea Shoot and Near Fatal Accidents video tv9d – Entertainment Videos in Telugu


తమిళ సినిమా కోసం సుహాస్ లైఫ్‌ ని రిస్క్‌లో పెడుతున్నాడా..! (వైఫ్) షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోగా, విలన్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు సుహాస్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎదిగాడు సుహాస్. ఇన్నాళ్లు తెలుగు సినిమాలతో మెప్పించిన సుహాస్ ఇప్పుడు తమిళ్ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. తమిళ్ స్టార్ కమెడియన్ సూరి హీరోగా చేస్తున్న మండాడి సినిమాలో సుహాస్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 10న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. సముద్రంలో పడవల పోటీ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుహాస్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా కోసం చేసిన రిస్క్ లను రివీల్ చేశాడు. మందాడి క్లైమాక్స్‌ కోసం దాదాపు 45 రోజులు సముద్రంలోనే ఉన్నామన్నాడు సుహాస్‌. 45 రోజుల పాటు సముద్రంలో సాగిన షూటింగ్‌లో బోట్లు తిరగబడిన సందర్భాలు కూడా ఉన్నాయన్నాడు. ఓ నాలుగు అయిదు సార్లు ఆల్మోస్ట్ ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని.. తనతో పాటు ఇంకొంతమంది ఇక అయిపోయాం అనుకున్నాం. కానీ కొద్దిలో మిస్ అయి బయటపడ్డాం. అంటూ చెప్పుకొచ్చాడు. అందులోనూ ఒక సీన్లో అయితే ఆల్మోస్ట్ కాలు బోట్ ప్రొపెల్లర్ వరకు వెళ్ళిందని.. అందులోకి వెళ్లి ఉంటే కాలు విరిగిపోయేదంటూ షాకింగ్‌ గా చెప్పుకొచ్చాడు. తనతో పాటు సూరి అన్న, కూడా ఈ సినిమా కోసం రిస్క్ చేశాడని సుహాస్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు రిలీజ్‌కు పెద్ద అడ్డంకి

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే..!

భారతీయులకు అమెరికా మరో షాక్.. గ్రీన్ కార్డ్ కోటా ఖతం!

వైకల్యాన్ని జయించి మద్రాస్‌ ఐఐటీలో సీటు సాధించి..

ఆర్బీఐ స్కీమ్‌కు అనూహ్య స్పందన.. ఎన్నారైల నుంచి పోటెత్తిన డాలర్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *