Headlines

Eshwar Sai : ఈశ్వర్ సాయి వివాదంలో కొత్త ట్విస్ట్.. ఫోన్ కాల్ బయటపెట్టిన శరణ్య.. | Folk Dancer Eswar Sai Wife Sharanya Breaks Silence on Viral Audio Leak and Marital Conflict


ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ల మధ్య చోటుచేసుకున్న వివాదంపై ఈశ్వర్ సాయి భార్య శరణ్య సంచలన వివరాలను బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె, ఘటన జరిగినప్పటి నుండి ప్రస్తుత పరిణామాల వరకు అనేక అంశాలను స్పష్టం చేశారు. తన భర్త, మాధురిల వ్యవహారం, ఆడియో కాల్ లీక్, పోలీసుల జోక్యం, కుటుంబంలో చోటుచేసుకున్న సంఘటనలపై ఆమె పూర్తి స్థాయిలో మాట్లాడారు. ఘటన జరిగిన రోజున, మొదట మాధురిని కొట్టానని, ఆ తర్వాత తన భర్త ఈశ్వర్ సాయిని కూడా కొట్టానని శరణ్య అన్నారు. అయితే, ఈశ్వర్ సాయిని కొట్టిన వీడియో బయటికి రాలేదని, కోపంలో ఫోన్ కింద పడేయడం వల్ల ఆ సన్నివేశం రికార్డు కాలేదని వివరించారు. పోలీసుల ముందు కూడా ఈశ్వర్ సాయిని మోసం చేయవద్దని, కుటుంబం బాగుండాలని అడిగానని తెలిపారు. ఈశ్వర్ సాయిని కొడుతున్న సమయంలో ఆయన నిశ్శబ్దంగా ఉండటానికి కారణం, అతను తప్పు చేసినప్పుడు అలాగే సైలెంట్ అవుతాడని, ఆ రోజు మద్యం సేవించి ఉన్నాడని శరణ్య చెప్పారు.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

పోలీస్ జోక్యం గురించి మాట్లాడుతూ, మొదట పోలీసులకు వెళ్లకూడదని తాను అనుకున్నానని, అయితే కుటుంబ సభ్యుల సలహా మేరకు పోలీసులకు ఫోన్ చేశామని తెలిపారు. ఆ సమయంలో తాను కెమెరా, పోలీసులు ఉన్నారని భయపెట్టే ఉద్దేశంతో అబద్ధాలు చెప్పానని ఒప్పుకున్నారు. వేములవాడ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళినప్పుడు, అక్కడి ఒక పెద్ద అధికారి ఇద్దరి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేసు పెట్టవద్దని సలహా ఇచ్చారని పేర్కొన్నారు. ఏదైనా జరిగితే తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ల మధ్య లీక్ అయిన ఆడియో కాల్ గురించి ప్రస్తావిస్తూ, అది తన భర్త ఇంటికి వచ్చిన తర్వాత జరిగిందని శరణ్య తెలిపారు. ఈశ్వర్ సాయి ఒక రోజు ఇంట్లో ఉన్న తర్వాత కుటుంబ కలహాల కారణంగా కొద్దిరోజులు బయటికి వెళ్లారని, ఆ సమయంలోనే మాధురితో ఈ సంభాషణ జరిగిందని చెప్పారు. “నువ్వు పెళ్లి చేసుకోనవసరం లేదు, మన ఇద్దరం కలిసి సంపాదించుకుందాం, సమాజాన్ని, శరణ్యను నేను చూసుకుంటాను” అని ఈశ్వర్ సాయి మాధురితో అన్నట్లు ఆ ఆడియోలో ఉందని శరణ్య వివరించారు. ఈ ఆడియోను తనకు వేరే వ్యక్తులు పంపించారని తెలిపారు. మాధురి తల్లి, తన కూతురు గురించి “మా అమ్మాయి అంతే” అని అన్నారని శరణ్య ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన కాల్ లిస్ట్, రికార్డింగ్ పోలీసుల వద్ద ఉంటాయని, మీడియా కోరితే బయటకు తీయించవచ్చని ఆమె సవాలు చేశారు. ఈ వివాదం మొత్తం తనను, తన కొడుకును ఎలా ప్రభావితం చేసిందో శరణ్య వివరించారు. తాను నిరంతరం ఏడుస్తూనే ఉన్నానని, తన కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నానని అన్నారు. ఈశ్వర్ సాయి తన కొడుకుకు క్షమాపణ చెప్పి, మళ్లీ ఇలా చేయనని హామీ ఇచ్చాడని తెలిపారు. తన జీవితం, కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉన్నానని, ఈ మొత్తం సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని శరణ్య స్పష్టం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *