Headlines

చించినాడ బ్రిడ్జిపై నుంచి మరో ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం.. ఒకరిని కాపాడిన స్థానికులు! | Chinchinada Bridge Tragedy: Tanuku Family Jumps into Godavari Due to Financial Crisis, Mother Rescued


కాకినాడ జిల్లాలో ఓ ఫ్యామిలీ మొత్తం నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే పశ్చిమగోదావరి జిల్లాలో మరో విషాద ఘటన వెలుగు చూసింది. తణుకుకి చెందిన నంబూరి శ్రీనివాస్‌గా అనే వ్యక్తి తన భార్య పద్మిని, కొడుకు,కూతుళ్లు వెంకటేశ్వర్, నిత్యశ్రీతో కలిసి చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.ఈ ఘటనలో శ్రీనివాస్‌ భార్య పద్మినిని స్థానిక జాలర్లు రక్షించగా.. ఆయనతో పాటు కుమారుడు వెంకటేశ్వర్‌, కుమార్తె నిత్యశ్రీ గల్లంతయ్యారు. అపస్మారక స్థితిలోకి చేరిన పద్మినిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే తణుకు నంబూరి శ్రీనివాస్, పద్మిని దంపతులు స్థానింకంగా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు వెంకటేశ్వర్
పాలిటెక్నిక్ చదువుతుండగా కూతురు నిత్యశ్రీ 9వ తరగతి చదువుతుంది. అయితే గత కొన్ని రోజులు ఫ్యామిలీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని.. ఆకారణంగానే ఆత్మహత్యకు యత్నించిన ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గల్లంతైన శ్రీనివాస్, అతని కొడుకు, కూతురు ఆచూకీ కోసం అధికారులు ముమ్మర గాలింపు చేపట్టారు.

అయితే గడిచిన వారం రోజుల్లో చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకడం ఇది రెండో సారి. గత వారం క్రితం కూడా ఇదే తరహాలో ఓ ఫ్యామిలీ బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. కాని సకాలంలో మత్స్యకారులు స్పదించి వారిని కాపాడడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ ఘటన మరువక ముందు మళ్లీ అలాంటి ఘటనే అక్కడ చోటు చేసుకోవడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *