Headlines

CSK Captain: చెన్నై కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ ఔట్.. కొత్త సారథిగా శాంసన్..? | Sanja samson vs Ruturaj Gaikwad who is new captain of csk


CSK Captain: ఐపీఎల్ 2027కు ముందే చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్సీపై చర్చ ఊపందుకుంది. ప్రస్తుతం సారథి రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్, చెన్నై ప్లేయర్ సంజూ శాంసన్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇప్పటివరకు సీఎస్‌కే యాజమాన్యం రుతురాజ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తామని అధికారికంగా ప్రకటించలేదు. సంజూ శాంసన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కెప్టెన్సీ అనుభవం ఉండటంతో సీఎస్‌కేకు అతడు సరైన ఎంపిక అవుతాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రుతురాజ్‌పై ఎందుకు చర్చ..?

రుతురాజ్ గైక్వాడ్ సీఎస్‌కేకు కీలక బ్యాటర్‌గా కొనసాగుతన్నాడు. చెన్నై టీం ఇటీవలి ఐపీఎల్ సీజన్లలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. దీంతో కెప్టెన్సీపై చర్చ చేయాలని భావిస్తున్నారు. వరుసగా 3 సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయిందనే వాదనతో నాయకత్వంపై కూడా సమీక్ష అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎక్కువమంది చదివినది: 9 సిక్సర్లు, 10 ఫోర్లతో బుడ్డోడి అరాచకం.. దులీప్‌లో దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ

ఇవి కూడా చదవండి



రుతురాజ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించే నిర్ణయం తీసుకుంటే తదుపరి నాయకుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్నది సీఎస్‌కేకు కీలక అంశంగా మారుతుంది. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్ పేరు తెరపైకి వస్తోంది.

సంజూ శాంసన్ ఎందుకు?

సంజూ శాంసన్‌కు రాజస్థాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. ఐపీఎల్‌లో జట్టును విజయవంతంగా నడిపించిన కెప్టెన్‌గా అతడికి గుర్తింపు ఉంది. అంతర్జాతీయ స్థాయిలోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఎక్కువమంది చదివినది: 27 ఫోర్లు, 27 సిక్స్‌లతో ఊచకోత.. 445 పరుగులతో వణుకు పుట్టించారుగా..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *