Headlines

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10 నాలుగో కంటెస్టెంట్‌గా రాయలసీమ కుర్రాడు.. సుధీర్ రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ ఇదే | Bigg Boss Telugu 10: Sudheer Reddy Entered As Fourth Contestant In To The Nagarjuna Reality Show, Know His Background


బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ గా ఆరంభమయింది. ఆదివారం (సెప్టెంబర్ 6) సాయంత్రం నుంచి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరుగుతోంది. హోస్ట్ కింగ్ నాగార్జున కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానిస్తున్నాడు. అలాగే వాళ్ల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తదితర విషయాల గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా ప్రముఖ సీరియల్ నటి దేబ్జానీ మోదక్ ఎంట్రీ ఇచ్చింది. ఇక రెండవ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్ ఎంట్రీ ఇచ్చాడు. మూడవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఝాన్సీ రాగా, నాలుగో కంటెస్టెంట్ గా సుధీర్ హౌస్ లోకి అడుగు పెట్టాడు.  రాయలసీమ ప్రాంతానికి చెందిన సుధీర్ రెడ్డి సింగపూర్ కి చదువుకోడానికి వెళ్లాడు. అయితే అక్కడ కొందరి చేతిలో మోసపోయాడు.  అదే సమయంలో అక్కడ పరిచయం అయినా ఓ వ్యక్తి ద్వారా హోస్ట్ గా మారాడు. మారి ఇంటర్వ్యూలు చేస్తూ ఫేమ్ తెచ్చుకున్నాడు. అలాగే ఫిజిక్ కోచ్ గా కూడా పనిచేస్తున్నాడు. బోల్డ్ ఇంటర్వ్యూల ద్వారా బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు సుధీర్. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన సుధీర్ తన జీవిత ప్రయాణం గురించి ఇలా చెప్పుకొచ్చాడు.

‘యూట్యూబర్ గా మారకముందు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. అయితే కేవలం నేను చేసే పనిని మాత్రమే నమ్ముకుని జీవితంలో ముందుకు వెళ్లాను. ఇప్పుడు అదే తనని ఇక్కడి వరకూ తీసుకొచ్చింది. ఉద్యోగం కోసం సింగపూర్‌ వెళ్తే, స్నేహితుడు మోసం చేశాడు. కేవలం 100 డాలర్ల చేతిలో ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. హౌస్‌ కీపింగ్‌, పార్ట్‌ టైమ్‌ జాబ్‌లు చేస్తూ జీవితం గడిపాను. డబ్బుల్లేక గురుద్వారాకు వెళ్లి కడుపు నింపుకొన్నాను.  అదే సమయంలో ఓ వ్యక్తి నాకు పరిచయమై తన డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీలో పనిచేయమని ఆఫర్‌ ఇచ్చారు. అలా నమ్మకంతో వచ్చిన నేను బిగ్‌బాస్‌ వరకూ వచ్చాను. అదే ధైర్యంతో ఇక్కడా ఆట ఆడతాను’ అని ధీమా వ్యక్తం చేశాడు సుధీర్ రెడ్డి.

స్నేహితుడి చేతిలో మోసపోయి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *