Headlines

Bigg Boss 10: ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణుడు


Bigg Boss 10: ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణుడు

వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, హ్యాపీడేస్ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు కృష్ణుడు. ముఖ్యంగా వినాయకుడు సినిమాలో హీరోగా అతని అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కూడా అయ్యింది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పదుల సినిమాల్లో నటించిన కృష్ణుడు ఆ మధ్యన పొలిటికల్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. అయితే ఇప్పుడు సినిమాలు, పాలిటిక్స్ రెండింటికీ దూరంగా ఉన్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. 2019 లో రిలీజైన హల్ చల్ అనే సినిమాలో చివరిసారిగా నటించాడు కృష్ణుడు. ఆ తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు. తాజాగా కృష్ణుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

తాజాగా తన ఏవీలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు కృష్ణుడు ఆయన మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా పిచ్చి. అప్పట్లోనే సినిమాల్లో ట్రై చేయి.. ఉన్నత స్థాయికి చేరుతావు అంటూ ఎంతోమంది ఎంకరేజ్ చేశారు. అలా ఇండస్ట్రీలోకి వచ్చాను. కానీ ఇక్కడ కొత్తగా ఏదీ లేదనిపించి ఇండస్ట్రీకి దూరం అయ్యాను. ఇప్పుడు మళ్లీ సినిమా అవకాశాలు వస్తున్నాయి’ అని తెలిపాడు కృష్ణుడు.

అప్పట్లో సన్నగా హీరో లుక్ లో ఉన్న కృష్ణుడు ఓ యాక్సిడెంట్ తర్వాత వాడిన మందులతో బాగా బరువు పెరిగిపోయారు. ఈ విషయాన్ని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు కృష్ణుడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన కృష్ణుడు.. దాదాపు 10ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు కృష్ణుడు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్నాడు. మరి బిగ్ బాస్ హౌస్ లో కృష్ణుడు ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *