Headlines

Bigg Boss Telugu 10: రెండు సార్లు బిగ్‌బాస్‌ ఆఫర్‌ను రిజెక్ట్ చేసి! ఇప్పుడు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘రిషి సర్’ | Bigg Boss Telugu 10: Nihar Mukesh Gowda Entered As Last Contestant In To The Nagarjuna Reality Show


బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆఖరి పదహారో కంటెస్టెంట్ గా ప్రముఖ సీరియల్ నటుడు ముఖేష్ గౌడ ఎంట్రీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం వరకు తెలుగులో ప్రసారమైన ‘గుప్పెడంత మనసు’ సీరియల్ తో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు ముఖేష్. అందులో అతను పోషించిన రిషి సర్ పాత్ర బాగా ఫేమస్ అయ్యింది. ఎంతలా అంటే ఇప్పుడు ముకేశ్ గౌడ తన సొంత పేరు కంటే రిషి సార్ పేరుతోనే బాగా పాపులారిటీ, క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కాగా ముఖేష్ స్వతహాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన వాడు. అయితేనేం తన యాక్టింగ్ తో తెలుగు ఆడియెన్స్  కు ఫేవరెట్ నటుడిగా మారిపోయాడు. సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ నటించాడు ముఖేష్. హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. కన్నడతో పాటు తెలుగులోనూ ‘గీతా శంకరం’ అనే చిత్రం చేశాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అయితే అవేవీ ముఖేష్ కు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *