Headlines

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్.. అదేంటంటే? | Vaibhav suryavanshi missed huge record in duleep trophy final


Vaibhav Suryavanshi record: దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి చరిత్ర సృష్టించే అవకాశం తృటిలో చేజారింది. ఈస్ట్ జోన్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. మరో ఆరు పరుగులు చేస్తే దులీప్ ట్రోఫీ ఫైనల్లో అర్ధశతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పే అవకాశం ఉండగా.. మిలింద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.

షార్ట్ బాల్‌తో మారిన స్టోరీ..

ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో చామ వి. మిలింద్ వేసిన షార్ట్ ఆఫ్ లెంగ్త్ బంతి వైభవ్ వికెట్‌కు కారణమైంది. బంతి బౌన్స్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయిన అతడు భారీ షాట్‌కు వెళ్లాడు. బంతి బ్యాట్ పైభాగాన్ని తాకి మిడ్ వికెట్ దిశగా గాల్లోకి వెళ్లింది. డీప్ స్క్వేర్ లెగ్ నుంచి వచ్చిన సౌత్ జోన్ ప్రత్యామ్నాయ ఫీల్డర్ త్యాగరాజన్ చక్కటి క్యాచ్ అందుకోవడంతో వైభవ్ ఇన్నింగ్స్ ముగిసింది.

ఎక్కువమంది చదివినది: Video: సెలెక్టర్ల ముందే సెంచరీతో ఇచ్చిపడేసిన ఛోటా ప్యాకెట్.. రీఎంట్రీని ఇక అడ్డుకునేదెవరు?

ఇవి కూడా చదవండి



37 బంతుల్లో 44 పరుగులు..

వైభవ్ తన ఇన్నింగ్స్‌లో 37 బంతులు ఎదుర్కొని 44 పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. అర్ధశతకానికి చేరువగా వచ్చిన అతడు దూకుడైన ఆటతో ఈస్ట్ జోన్‌కు వేగవంతమైన ఆరంభాన్ని అందించాడు. రికార్డు చేజారినా.. అతడి బ్యాటింగ్ ప్రభావం మాత్రం తొలి దశలో స్పష్టంగా కనిపించింది.

ఈశ్వరన్‌తో సెంచరీ భాగస్వామ్యం

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఈస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్ కలిసి తొలి వికెట్‌కు 100 పరుగులు జోడించారు. వైభవ్ 44 పరుగులు చేయగా.. ఈశ్వరన్ 55 పరుగులతో అర్ధశతకం పూర్తి చేశాడు. ఇద్దరూ వేగంగా పరుగులు సాధించడంతో ఈస్ట్ జోన్‌కు మంచి పునాది పడింది.

ఎక్కువమంది చదివినది: Video: ఏం వైస్ కెప్టెన్ ఏంటి సంగతి.. బుడ్డోడిని కెలికిన తిలక్ వర్మ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

సిరాజ్ ఓవర్‌లో మెరుపులు..

తన దూకుడు బ్యాటింగ్‌తో వైభవ్ మరోసారి ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో వరుసగా బౌండరీలు సాధించాడు. ఓ ఫోర్, సిక్స్‌తో పాటు మరో బౌండరీని అదే ఓవర్‌లో కొట్టి తన ఉద్దేశాన్ని చాటాడు. అయితే ఆ తర్వాత మిలింద్ వేసిన షార్ట్ బాల్ అతడి ఇన్నింగ్స్‌కు బ్రేక్ వేసింది.

అర్ధశతకం పూర్తి చేసి ఉంటే దులీప్ ట్రోఫీ ఫైనల్ చరిత్రలో అరుదైన రికార్డు వైభవ్ ఖాతాలో చేరేది. చివరకు 44 పరుగులకే ఆగిపోయినా, ఫైనల్ వంటి కీలక వేదికపై అతడు ఇచ్చిన ఆరంభం ఈస్ట్ జోన్‌కు విలువైనదిగా మారింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *