ప్యూర్టోరికో నుంచి వచ్చిన ఒక విమానం మయామి విమానాశ్రయంలో దిగుతున్న సమయంలో రన్‌వేపై అకస్మాత్తుగా అదుపుతప్పింది. నియంత్రణ కోల్పోయిన అమెజాన్ కార్గో విమానం రన్‌వే పక్కనే ఉన్న రోడ్డుపైకి దూసుకెళ్లి అక్కడ తిరుగుతున్న వాహనాలను తీవ్రంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. ఇందుకు సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం బయటకు వచ్చాయి. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మయామీ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదం సంభవించింది.
విమానంలో చిక్కుకుపోయిన సిబ్బంది
విమాన కాక్‌పిట్‌లో పైలట్, కో-పైలట్ చిక్కుకుపోగా, కార్లలో ఉన్న ప్రయాణికులు కూడా ప్రమాదంలో ఇరుక్కుపోయారు. ఒక వాహనం కింద చిక్కుకున్న వ్యక్తిని సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. విమానం ఢీకొన్నప్పుడు తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఐదుగురు కార్లలోనే ఉన్నారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Footage shows the moment that the 21 Air Flight 7598 overran the runway and crashed at Miami International Airport. Per reports, at least 5 individuals are dead with an unspecified number of injuries. pic.twitter.com/cOKhKwoTwh
— OSINTdefender (@sentdefender) September 7, 2026
ప్రమాదం కారణంగా రద్దీగా ఉండే మయామి విమానాశ్రయంలో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపివేసారు. అన్ని రన్వేలు, ట్యాక్సీవేలను మూసివేసిన అధికారులు.. ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లే ముందు తమ ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని సూచించారు. మయామి ఫైర్ రెస్క్యూ విభాగం 200 మంది సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
ఈ ప్రమాదానికి గల కారణం తెలుసుకోవడానికి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) దర్యాప్తును ప్రారంభించాయి. ఆదివారం జరిగిన రన్‌వే ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక ‘గో టీమ్’ను రంగంలోకి దించినట్లు NTSB ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చూడండి