Headlines

థియేటర్లలో మున్నా భయ్యా రచ్చ.. మూవీగా ‘మిర్జాపూర్’ ఎలా ఉంది? | Munna Bhaiyas Grand Return: Mirzapur Film Hits Theatres VIDEO tv9d – Entertainment Videos in Telugu


ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం సృష్టించిన మిర్జాపూర్ వెబ్ సిరీస్ ఇప్పుడు సినిమా రూపంలో థియేటర్లలో విడుదలయ్యింది. ఇది సీజన్-3 తర్వాత వచ్చే కథ కాదని, 2018లో జరిగిన సీజన్-1 మధ్యలో జరిగిన ఒక అన్టోల్డ్ స్టోరీ అని రివ్యూలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ మున్నా భయ్యా (దివ్యేందు) తిరిగి రావడం. థియేటర్లలో దివ్యేందు కనిపించిన వెంటనే ఈలలు, గోలలు మామూలుగా లేవని ప్రేక్షకులు చెబుతున్నారు. కలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి తన క్లాస్ అండ్ మాస్‌తో ఆకట్టుకోగా, గుడ్డు పండిట్‌గా అలీ ఫజల్ క్రూరత్వం పీక్స్ లో ఉంది. ఓటీటీ షోను కేవలం సినిమాగా మార్చడమే కాకుండా, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రా అండ్ రస్టిక్ విజువల్స్‌తో థియేటర్ స్థాయికి పెంచారు. రవికిషన్ ఎంట్రీ సెకండ్ హాఫ్‌కు మరింత బలాన్ని ఇచ్చింది. అయితే, దాదాపు మూడు గంటల రన్ టైమ్, కొన్ని చోట్ల కథనం సాగదీసినట్లు అనిపించడం మైనస్‌లుగా నిలుస్తున్నాయి. మిర్జాపూర్ సిరీస్ అభిమానులకు ఇది ఒక ఐ ఫీస్ట్ అని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *