Headlines

హీరోను చూసి పరాఠాలు.. తెలుపు మిస్సైందని ఎరుపుతోనే జర్నీ.. ప్రిన్స్ గురించి ఈ విషయాలు తెలుసా..? | Team India Captain Shubman Gill Birthday Interesting Facts


Shubman Gill Birthday: టీమిండియా స్టార్ బ్యాటర్, టెస్ట్-వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 27వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. 2026 సెప్టెంబర్ 8న బర్త్‌డే చేసుకుంటున్న గిల్.. స్కూల్ క్రికెట్ నుంచి అండర్-19, ఫస్ట్‌క్లాస్, ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ వరకు తనదైన ముద్ర వేశాడు. ఈ సందర్భంగా అతని కెరీర్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.

రితిక్ రోషన్ వల్లే పరాఠాలు..!

చిన్నతనంలో పంజాబీ అయినప్పటికీ గిల్‌కు పరాఠాలు తినడం ఇష్టం ఉండేది కాదు. అయితే బాలీవుడ్ నటుడు రితిక్ రోషన్‌కు అభిమాని అయిన గిల్.. ‘కహో నా ప్యార్ హై’ సినిమాలో ఆయన పరాఠాలు తినడం చూసి తానూ వాటిని తినడం మొదలుపెట్టాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఎక్కువమంది చదివినది: Video: ఏం వైస్ కెప్టెన్ ఏంటి సంగతి.. బుడ్డోడిని కెలికిన తిలక్ వర్మ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఇవి కూడా చదవండి



ఎర్ర రుమాలు సెంటిమెంట్..

గిల్‌కు క్రికెట్‌లో ఓ ప్రత్యేకమైన ఎర్ర రుమాలు (red handkerchief sentiment) ఉంది. అండర్-16 స్థాయిలో పరుగులు రావడం లేదని భావించిన సమయంలో తెల్ల రుమాలు పట్టుకుని ఆడిన మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. ఆ రుమాలు మురికిగా మారడంతో తర్వాతి మ్యాచ్‌లో ఎర్ర రుమాలు తీసుకెళ్లాడు. ఆ మ్యాచ్‌లోనూ శతకం రావడంతో అప్పటి నుంచి ఎరుపు రంగు రుమాలు అతని ఆటలో భాగమైంది.

యూత్ క్రికెట్‌లో అరుదైన రికార్డు..

యూత్ వన్డేల్లో (Youth ODI) గిల్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. 16 మ్యాచ్‌ల్లో 15 ఇన్నింగ్స్‌లు ఆడిన అతను 1,149 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతని బ్యాటింగ్ సగటు 104.45. యూత్ వన్డేల్లో 100కుపైగా సగటు కలిగిన ఏకైక బ్యాటర్‌గా గిల్ నిలిచాడు.

ఎక్కువమంది చదివినది: Video: సెలెక్టర్ల ముందే సెంచరీతో ఇచ్చిపడేసిన ఛోటా ప్యాకెట్.. రీఎంట్రీని ఇక అడ్డుకునేదెవరు?

స్టార్‌గా ఎదిగిన గిల్..

అండర్-19 క్రికెట్‌లోనే తన ప్రతిభను చాటుకున్న గిల్.. ఆ తర్వాత టీమిండియాలోకి వచ్చి క్రమంగా స్థిరపడ్డాడు. ప్రస్తుతం భారత టెస్ట్, వన్డే (Test and ODI captain) గా వ్యవహరిస్తున్న అతను జట్టు కొత్త తరానికి కీలక బ్యాటర్‌గా ఎదిగాడు. గిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ గణాంకాలు, వ్యక్తిగత సెంటిమెంట్లు అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *