కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లోనూ పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. కానీ భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు మొదటి షో నుంచే బీభత్సమైన నెగెటివ్ టాక్ వచ్చింది. కథలో ఏ మాత్రం కొత్తదనం లేదని, యాక్షన్ సీన్లు, బోల్డ్ సన్నివేశాలతో సినిమాను నింపేశారని విమర్శలు వచ్చాయి. రివ్యూలు కూడా నెగటివ్ గా వచ్చాయి. అయినా అడ్వాన్స్ బుకింగ్స్ తో కలిసి మొదటి రోజు టాక్సిక్ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. కానీ రెండో రోజుకు సీన్ మారిపోయింది. కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఆ తర్వాత కూడా ఇదే కంటిన్యూ కావడంతో టాక్సిక్ సినిమా డిజాస్టర్ల లిస్టులో చేరిపోయింది. ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి ఈ సినిమాకు రూ. 200 కోట్ల మేర కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా.. డిజిటల్, శాటిలైట్ హక్కుల ధరల విషయంలోనూ భారీగా నష్టపోయిందని టాక్. సినిమా విడుదలకి ముందు రూ. 200 కోట్లు డిమాండ్ చేసిన నిర్మాతలకు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కేవలం రూ. 30 కోట్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
విడుదలకు ముందు టాక్సిక్ సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల నుంచి దాదాపు రూ. 150 కోట్లకు పైగా ఆఫర్లు వచ్చాయట. అయితే నిర్మాతలు అంతకంటే ఎక్కువ ఆశించడంతో అప్పట్లో డీల్ సెట్ కాలేదు. అయితే తీరా థియేట్రికల్ రిలీజ్ తర్వాత సినిమాకు భారీగా నెగెటివ్ టాక్ రావడం, కలెక్షన్లు కూడా రాకపోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 కేవలం రూ. 30 కోట్లకు టాక్సిక్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం.
కాగా ముందుగా థియేట్రికల్ రిలీజ్ అయిన 6-8 వారాల తర్వాతే టాక్సిక్ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని అనుకున్నారట. అయితే ఇప్పుడు ఆ డేట్ కూడా మారిపోయిందని సమాచారం. నెల రోజులకే ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా ఓటీటీలోకి వస్తోందని టాక్. అన్నీ కుదిరితే సెప్టెంబర్ ఆఖరి వారంలోనే టాక్సిక్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రావొచ్చని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై మరిన్ని అప్డేట్స్ రానున్నాయని సమాచారం.
టాక్సిక్ సినిమా విషయానికి వస్తే.. కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్ మాన్‌స్టర్ మైండ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. . నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి
టాక్సిక్ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి