Headlines

ODI Runs 2026: గిల్ టాప్.. కోహ్లీ సెవెన్త్.. ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసింది ఎవరో తెలుసా? | Most runs in odis 2026 shubman gill virat kohli joe root stats


ODI Runs 2026: 2026 అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ఈ ఏడాది అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో నిలిచాడు. జో రూట్, విరాట్ కోహ్లీ సహా టాప్-7లో చోటు దక్కించుకున్న మిగతా స్టార్ ప్లేయర్లు ఎవరోచూద్దాం.

అగ్రస్థానంలో దూసుకెళ్తున్న శుభ్‌మన్ గిల్

టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది వన్డేల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో ఏకంగా 561 పరుగులు సాధించి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసంచేసుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌పై ఆడిన 154 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఈ ఏడాదికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ 80, 31, 77 పరుగులతో నిలకడైన ప్రదర్శన కనబరిచి తన ఫామ్‌ను చాటుకున్నాడు.

రెండో స్థానంలో జో రూట్

ఇంగ్లాండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ 6 మ్యాచుల్లో 496 పరుగులు చేసి ఈ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకతో జనవరిలో జరిగిన సిరీస్‌లో 75, 61, 111 (నాటౌట్) పరుగులతో కంబ్యాక్ ఇచ్చిన రూట్, భారత్‌తో జరిగిన సిరీస్‌లోనూ భారీగా పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్ ఓపెనర్ తంజీద్ హసన్ 12 మ్యాచుల్లో 486 పరుగులు చేసి మూడో స్థానంలో నిలవగా, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డెరిల్ మిచెల్ 6 మ్యాచుల్లో 473 పరుగులతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు.

సంచలనం సృష్టిస్తున్న నేపాల్ ప్లేయర్

ఈ రన్స్ రేసులో నేపాల్ ప్లేయర్ దేవేంద్ర సింగ్ ఐరీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 12 మ్యాచుల్లో 444 పరుగులు చేసి ఐదో స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ యంగ్ సెన్సేషన్ తౌహీద్ హృదోయ్ 12 మ్యాచుల్లో 433 పరుగులు చేసి ఆరో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అసోసియేట్ జట్ల నుంచి ఐరీ లాంటి క్రీడాకారులు అగ్రశ్రేణి ఆటగాళ్లతో పోటీపడుతూ టాప్-7లో చోటు సంపాదించడం విశేషం.

ఏడో స్థానంలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ

భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ జాబితాలో 384 పరుగులతో ఏడో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లలో పాల్గొన్న కోహ్లీ, ఇంగ్లాండ్‌పై ఆడిన మూడు వన్డేల్లో 5, 65, 74 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. స్వల్ప మ్యాచులు ఆడినప్పటికీ తనదైన శైలిలో రాణించి ఈ క్యాలెండర్ ఇయర్‌లో టాప్-7లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

ఈ ఏడాది వన్డేల్లో గిల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, యువ ఆటగాళ్లతో పాటు సీనియర్లు సైతం పోటీపడుతున్నారు. రాబోయే మ్యాచ్‌లలో ఈ జాబితాలో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *