బిగ్ బాస్ భాను శ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై పలు షోల ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. అయితే గతంలో తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత బాధాకరమైన ఆర్థిక మోసం గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మి, రూ.20 లక్షలు కోల్పోయిన తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, ఒక వ్యక్తికి ఆమె రూ.20 లక్షలు నగదు రూపంలో ఇచ్చారు. మొదట, రెండు సంవత్సరాల పాటు ఆ వ్యక్తి ప్రతి నెలా 3 శాతం వడ్డీని ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేశారు. వడ్డీని క్రమం తప్పకుండా చెల్లిస్తుండటంతో, భాను శ్రీకి ఆ వ్యక్తిపై నమ్మకం మరింత పెరిగింది. రెండు సంవత్సరాల తర్వాత, తన డబ్బును తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు, ఆ వ్యక్తి అకస్మాత్తుగా డబ్బు ఇవ్వలేమని, అది తమ వద్ద లేదని చెప్పినట్లు భాను శ్రీ పేర్కొన్నారు. తాను ఆశ్చర్యపోయి, డబ్బు ఎందుకు ఇవ్వలేరని ప్రశ్నించినప్పుడు, వారు “మాకు ఇవ్వలేము అంటే ఇవ్వలేము అంతే” అని సమాధానం ఇచ్చారని తెలిపారు. తమ డబ్బును షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టామని, అందులో అది కోల్పోయిందని ఆ వ్యక్తి చెప్పాడని భాను శ్రీ వివరించారు.
ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..
అయితే, అసలు సమస్య ఏమిటంటే, భాను శ్రీ ఆ వ్యక్తికి రూ.20 లక్షలు నగదు రూపంలో ఇచ్చారు. దీని కారణంగా, తనకు డబ్బు ఇచ్చినట్లు ఎలాంటి రుజువు లేదని ఆ వ్యక్తి వాదించడం ప్రారంభించారు. “నువ్వు ఎక్కడ ఇచ్చావు మాకు డబ్బులు? మాకు ఇవ్వలేదు నువ్వు. ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించు” అని వారు నిరాకరించినట్లు భాను శ్రీ తీవ్ర ఆవేదనతో తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..
ఆమె ఇంటిని కొనుగోలు చేయాలనే ఆశతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అప్పట్లో రూ.50 లక్షలకు ఒక ఫ్లాట్ వస్తుందని, తాను రూ.20 లక్షలు ఇచ్చి మిగిలిన రూ.30 లక్షలకు ఈఎంఐ కట్టుకోవాలని భావించానని వివరించారు. ఈ మొత్తాన్ని సమకూర్చడానికి, తన వద్ద ఉన్న రూ.12 లక్షలతో పాటు, తన తల్లికి చెందిన ఒక చిన్న భూమిని సైతం అమ్మి మిగిలిన డబ్బును కలిపి ఇచ్చానని భాను శ్రీ తెలిపారు. “ఊర్లో ల్యాండ్ ఏం చేస్తది, ఇల్లు ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్” అని అప్పట్లో తాను భావించినట్లు చెప్పారు. చివరికి, “మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి. పోలీస్ కేస్ పెట్టుకుంటే పెట్టుకోండి, మాకేం సంబంధం లేదు” అని ఆ వ్యక్తి బెదిరించినట్లు భాను శ్రీ గుర్తు చేసుకున్నారు. ఈ ఘటన తనను మానసికంగా, ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీసిందని అన్నారు. అయితే, “దానికంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి” అని తాను దృఢ సంకల్పంతో ఉన్నానని చెప్పారు. తనను మోసం చేసిన వారు ఇప్పటికీ రోడ్డు మీదే ఉన్నారని, కర్మ తిరిగి వారిని బాధిస్తుందని అన్నారు. “కర్మ విల్ హిట్ బ్యాక్” అనే సూక్తిని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ ఘటన భాను శ్రీ జీవితంలో ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది.
ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..
భాను శ్రీ..
ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..