Headlines

Kitchen Tips: ఇంత ఈజీనా.. టూత్ పేస్ట్‌తో మీ కడాయి తళతళ మెరిసిపోవాల్సిందే.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు.. | How to Clean a Blackened Kadai with Toothpaste: Simple Kitchen Cleaning Hack

Kitchen Tips: ఇంత ఈజీనా.. టూత్ పేస్ట్‌తో మీ కడాయి తళతళ మెరిసిపోవాల్సిందే.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు.. | How to Clean a Blackened Kadai with Toothpaste: Simple Kitchen Cleaning Hack


కిచెన్‌లో ఎంత జాగ్రత్తగా వంట చేసినా.. కడాయి అడుగుభాగం నల్లగా మారిపోతుంటుంది. ఏళ్ల తరబడి వాడటం వల్ల పేరుకుపోయిన ఆ మాడిన మరకలను వంటసోడాలు, సబ్బులతో గంటల తరబడి తోమినా ఫలితం ఉండదు. అయితే ఎంతో శ్రమతో కూడుకున్న ఈ పనిని సులువుగా పూర్తి చేయడానికి మన ఇంట్లో రోజూ వాడే టూత్‌పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుందని తెలుసా? కేవలం పళ్లను తోముకోవడానికి మాత్రమే కాకుండా మాడిన పాత్రలను మెరిపించడానికి కూడా టూత్‌పేస్ట్ ఒక అద్భుత పరిష్కారమని హోమ్ హ్యాక్స్ నివేదికలు చెబుతున్నాయి.

టూత్‌పేస్ట్ ఎలా పనిచేస్తుంది?

రీడర్స్ డైజెస్ట్ నివేదిక ప్రకారం.. చాలా రకాల టూత్‌పేస్టులలో మైల్డ్ అబ్రేసివ్స్ ఉంటాయి. ఇవి పాత్రల ఉపరితలానికి ఎటువంటి హాని కలగకుండా, గట్టిగా పేరుకుపోయిన మాడిన పదార్థాలను, జిడ్డును తుడిచిపెట్టేస్తాయి. అంతేకాకుండా టూత్‌పేస్ట్‌లో ఉండే బేకింగ్ సోడా, ఇతర క్లీనింగ్ ఏజెంట్లు లోహాలపై ఉండే ఆక్సిడేషన్ గుర్తులను తొలగించి, పాత్రలకు మెరుపును అందిస్తాయి. కఠినమైన రసాయనాలు వాడకుండా పాత్రలను శుభ్రం చేయడానికి ఇది సురక్షితమైన మార్గం.

శుభ్రం చేసే సరైన పద్ధతి ఇదే..

కడాయిని తడపడం: ముందుగా నల్లగా మారిన కడాయిపై కొద్దిగా నీళ్లు చిలకరించాలి.

పేస్ట్ రాయడం: మాడిన లేదా నల్లటి భాగానికి తెలుపు రంగులో ఉండే టూత్‌పేస్ట్‌ను దట్టంగా పూసి, 5 నుండి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.

రుద్దడం: ఆ తర్వాత పాత్రలు తోమే స్క్రబ్బర్‌తో కాస్త గట్టిగా రుద్దాలి. దీంతో నల్లదనం విడిపోవడం గమనించవచ్చు.

కడగడం: మరకలు బాగా పాతవైతే ఈ ప్రక్రియను మరోసారి పునరావృతం చేయాలి. చివరగా గోరువెచ్చని నీళ్లు, డిష్ వాషింగ్ లిక్విడ్‌తో కడిగేస్తే కడాయి కొత్తదానిలా మెరిసిపోతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు – ముఖ్యమైన చిట్కాలు..

జెల్ పేస్ట్ వాడకండి: ది స్ప్రూస్ నివేదిక ప్రకారం.. క్లీనింగ్ కోసం ఎప్పుడూ సాధారణ వైట్ టూత్‌పేస్ట్‌ను మాత్రమే ఎంచుకోవాలి. జెల్ రకానికి చెందిన పేస్టులలో క్లీనింగ్ సామర్థ్యం తక్కువగా ఉంటుంది.

వైర్ స్క్రబ్బర్లతో జాగ్రత్త: మరీ గట్టిగా ఉండే ఇనుప పీచులను వాడకూడదు, వీటివల్ల పాత్రలపై గీతలు పడే ప్రమాదం ఉంది.

ఉప్పు జోడించండి: కడాయి బాగా మాడిపోయి ఉంటే, టూత్‌పేస్ట్‌లో కాస్త ఉప్పు కలిపి వాడితే అది పవర్‌ఫుల్ స్క్రబ్‌లా పనిచేస్తుంది.

ఈ వినూత్న చిట్కా కేవలం ఇనుము లేదా స్టీల్ కడాయిలకు మాత్రమే కాకుండా.. ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి కూడా ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *