ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమాపై ఇప్పుడు రెండు మెయిన్ సీజన్స్ అన్నీ ఆధారపడి ఉన్నాయి. ఆ ఒక్కటి కానీ టైమ్‌కు వచ్చిందా అన్నీ సక్రమంగా జరుగుతాయి. కానీ అదేమైనా తేడా కొట్టి వాయిదా పడిందా.. ఒకేసారి రెండు మేజర్ సీజన్స్ దెబ్బతింటాయి.. వాటిపై ఎఫెక్ట్ దారుణంగా పడుతుంది. మరి అంతగా భయపెడుతున్న ఆ సినిమా ఏంటి..? అందులో హీరో ఎవరు..? ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన సినిమా వస్తుందంటే కనీసం 15 రోజుల వరకు మరో సినిమా పోటీలో ఉండకూడదు.. రెబల్ స్టార్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ఇంపాక్ట్ అలా ఉంటుంది మరి. ఫౌజీ విషయంలోనూ ఇదే చేస్తున్నారు మేకర్స్. డిసెంబర్ 3న ఈ సినిమా వస్తుందని తెలిసి.. మరే సినిమాను కనీసం దాని దరిదాపుల్లోకి కూడా తీసుకురావట్లేదు. ఫౌజీ షూటింగ్ వేగంగా జరుగుతున్నా.. రిలీజ్ డేట్ మీద మాత్రం ఇప్పటికీ ఎక్కడో చిన్న అనుమానాలు అలాగే ఉండిపోయాయి. కానీ నిర్మాతలు మాత్రం కచ్చితంగా డిసెంబర్ 3నే ఫౌజీ వస్తుందంటున్నారు. అలా వస్తే ఎవరికీ ఏ సమస్యా ఉండదు. కానీ అలా కాకుండా ఫౌజీ వాయిదా పడితే ముందుగా డిస్టర్బ్ అయ్యేది సంక్రాంతి సీజనే. ఇప్పటికే అక్కడ చిరంజీవి, వెంకటేష్ లాంటి హీరోలు ఖర్చీఫ్ వేసారు. ఫౌజీ చెప్పిన టైమ్‌కి రాకపోతే.. 2027, మార్చి 5న రావాల్సిన స్పిరిట్‌పై ప్రభావం తప్పదు. దానివల్ల 2027 సమ్మర్ సీజన్ కూడా డిస్టర్బ్ అవుతుంది. స్పిరిట్ షూట్ ఇప్పటికే 40 శాతం పూర్తైంది.. ఫౌజీని బ్యాలెన్స్ చేస్తూ స్పిరిట్ పూర్తి చేస్తున్నారు ప్రభాస్. మొత్తానికిప్పుడు బాల్ ఫౌజీ ఖాతాలో ఉంది.. అదొక్కటి డిసెంబర్ 3న వస్తే.. సంక్రాంతి, సమ్మర్ సీజన్స్ ప్రశాంతంగా ఉంటాయి. చూడాలిక.. ఏం జరగబోతుందో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక.. మెట్రో, ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం!