Headlines

ఇంటి బాల్కనీ, టెర్రస్‌, గోడల్లో పెరిగే రావి చెట్టును వేళ్లతో సహా తీసేయాలంటే.. ఇలా చేయండి! | Peepal Tree Growing on Your House Wall? Know How to Remove It Safely and Traditionally


చాలా ఇళ్లలో బాల్కనీలు, పగుళ్లు ఉన్న గోడలు లేదా మేడ భాగాలలో అనుకోకుండా రావి మొక్కలు మొలవడం మనం చూస్తూనే ఉంటాం. హిందూ సంప్రదాయం ప్రకారం రావి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా, అత్యంత పవిత్రమైనదిగా పూజిస్తారు. అయితే, ఇంటి గోడలలో రావి చెట్టు వేళ్లు వేగంగా విస్తరించి భవన నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభప్రదం కాదని అంటారు. మరి మత విశ్వాసాలు దెబ్బతినకుండా, ఇంటికి నష్టం కలగకుండా ఈ మొక్కను ఎలా తొలగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వేళ్లతో సహా జాగ్రత్తగా తీయడం:

రావి చెట్టు వేళ్లు చాలా లోతుకు విస్తరిస్తాయి. అందువల్ల మొక్కను పైపైన నరికివేస్తే మళ్లీ పెరుగుతుంది.

మొక్క చుట్టూ ఉన్న మట్టి లేదా గోడ సందును మెల్లగా తవ్వి, వేళ్లకు ఏమాత్రం దెబ్బతగలకుండా బయటకు తీయాలి.

ఇవి కూడా చదవండి



మట్టి గట్టిగా ఉంటే కొద్దిగా నీరు పోసి, వేళ్లు వదులయ్యే వరకు వేచి చూసి సున్నితంగా తొలగించాలి.

రీ-పాటింగ్ లేదా వేరే చోట నాటడం. రావి చెట్టును నరికివేయడం లేదా పారేయడం శాస్త్ర సమ్మతం కాదు. తొలగించిన మొక్కను ఒక కుండీలో నాటి కొన్ని రోజులు పెంచవచ్చు. లేదా సమీపంలో ఉన్న పార్కు, గుడి ఆవరణ లేదా ఖాళీ మైదానంలో దానిని నాటి నీరు పోయాలి. దీనివల్ల ఒక ప్రాణాన్ని కాపాడిన పుణ్యం లభిస్తుంది.

మతపరమైన, వాస్తు నియమాలు:

రావి మొక్కను తొలగించేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించడం మంచిదని పెద్దలు చెబుతారు.

శనివారం అనుకూలం: రావి మొక్కను తొలగించడానికి శనివారం రోజు శ్రేష్ఠమైనదిగా భావిస్తారు.

నమస్కరించి క్షమాపణ కోరడం: మొక్కను తీసే ముందు దానికి సమస్కరించి, ఇంటి రక్షణ కోసం మాత్రమే దీనిని వేరే ప్రదేశానికి మారుస్తున్నానని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి.

దీపం వెలిగించడం: మొక్కను వేరే చోట నాటిన తర్వాత అక్కడ కొద్దిగా నీరు పోసి, దీపం వెలిగించడం శుభ పరిణామంగా పరిగణిస్తారు.

ఇంటి నిర్మాణాన్ని కాపాడుకోవడంతో పాటు ఆధ్యాత్మిక విశ్వాసాలను గౌరవించడానికి ఈ పద్ధతి అత్యంత సమర్థవంతమైనది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *