Headlines

Telangana: సంచలన నిర్ణయం.. తెలంగాణలో ఆ పనీర్‌ నిషేధం.. | Sensational Decision.. Telangana Bans Analog Paneer


Telangana: హోటళ్లు, దాబాలు, రోడ్డు పక్కన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో పన్నీర్ బట్టర్ మసాలా, పన్నీర్ టిక్కా అంటూ లొట్టలేసుకుని లాగించే భోజన ప్రియలకు తెలంగాణ ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తున్న కృత్రిమ, నాన్-డైరీ అనలాగ్ పన్నీర్ దందాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.

తాజాగా తెలంగాణలో అనలాగ్‌ పనీర్‌పై నిషేధం విధించారు అధికారులు. నాన్‌ డెయిరీ, ఆర్టిఫిషియల్‌ పనీర్‌ను బ్యాన్‌ చేశారు. పనీర్‌ పేరుతో తయారీ, ప్రాసెసింగ్‌తో పాటు ప్యాకింగ్‌, నిల్వ, విక్రయాలపై నిషేధించారు అధికారులు. అయితే ఈ నిషేధం నేటి నుంచి అమల్లోకి వస్తుంది. ఫుడ్‌ సేఫ్టి అండ్‌ స్టాండర్స్డ్‌ యాక్ట్ 2006లోని సెక్షన్‌ 30(2)(a) కింద టీజీ సేఫ్‌ ఆదేశాలు జారీ చేసింది.

ప్రజల అనారోగ్యాన్ని దెబ్బతీసే ఇటువంటి పదార్థాలపై చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. అసలైన పన్నీర్‌ను ఆవు లేదా గేదె పాలతో తయారు చేస్తారు. అయితే, కొందరు కల్తీ చేస్తూ అధిక లాభాల కోసం ప్రజల ఆనారోగ్యంతో ఆడుకుంటున్నవారికిపై కొరడా ఝులిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *