Headlines

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ కృష్ణుడి ఫ్యామిలీని చూశారా? కూతురు ఎంత క్యూట్ గా ఉందో! వీడియో | Bigg Boss Telugu 10: Have You Seen Contestant Krishnudu Family, His Wife And Daughter Cute Video Goes Viral


అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగుతోంది. ఈసారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. వీరిలో 10 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కాగా మరో ఆరుగురు కామనర్స్ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే వీరు బ్లూ టీమ్, రెడ్ టీమ్ అంటూ రెండు గ్రూపులుగా విడిపోయి తమ బలా బలాలను చూపిస్తున్నారు. కాగా బిగ్ బాస్ 10లో సెలబ్రిటీ కంటెస్టెంట్స్ గా అడుగు పెట్టిన 10 మందిలో నటుడు కృష్ణుడు కూడా ఒకరు. వినాయకుడు సినిమాలో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన సహాయక నటుడిగానూ మెప్పించారు. అయితే చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న కృష్ణుడు ఇప్పుడు బిగ్ బాస్ 10లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టారు. ఈ రియాలిటీ షోలో సత్తా చాటి మళ్లీ నటునిగా బిజీ అవ్వాలని కృష్ణుడు కోరుకుంటున్నారు. కాగా సినిమాల్లో ఎంతో కామ్ గా, అమాయకుడిగా కనిపించారు కృష్ణుడు. నిజ జీవితంలోనూ అంతే సరదాగా ఉన్నారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ లో మాత్రం చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారీ సీనియర్ యాక్టర్. ఇది తన గేమ్ ప్లానో లేదా మరే కారణమో తెలియదు కానీ కొన్ని సందర్భాల్లో బాగా సీరియస్ అవుతున్నారు కృష్ణుడు. ముఖ్యంగా హీరో త్రిగుణ్ కు సపోర్ట్ గా ఉంటూ రోహిత్ పై తెగ కోపం చూపిస్తున్నాడని బిగ్ బాస్ ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా బిగ్ బాస్ 10 ప్రారంభమై కేవలం నాలుగు రోజులే గడిచాయి. కాబట్టి కృష్ణుడు గేమ్ ప్లాన్ ఎలా ఉందో, ఫిజికల్ టాస్కులు ఎలా ఆడుతాడో పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

సినిమాల పరంగా కృష్ణుడి గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఆయనకు పెళ్లై ఒక పాప కూడా ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేముందు కృష్ణుడు తన కుటుంబంతో కలిసి ఉన్న ఒక వీడియో ఇప్పుడుసోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది. ఇందులో కృష్ణుడి భార్యతో పాటు ఆయన కూతురును కూడా చూడవచ్చు. కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు కృష్ణుడు ఫ్యామిలీ ఎంతో అందంగా ఉందంటున్నారు. ముఖ్యంగా కూతురు చాలా క్యూట్ గా ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి



భార్య, కూతురితో కృష్ణుడు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *