Headlines

Actor Karthi: కార్తీ, ఆ టాలీవుడ్ స్టార్ హీరో క్లాస్ మేట్స్ అని తెలుసా? ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు.. | Did You Know Karthi and Mahesh Babu went to the same school in Chennai, Full Details Here


కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా సర్దార్ 2. సుమారు నాలుగేళ్ల క్రితం వచ్చిన సర్దార్ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. మొదటి పార్ట్ ను తెరకెక్కించిన డైరెక్టర్ పీఎస్ మిత్రనే సర్దార్ 2 సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మాళవిక మోహనన్‌, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. అలాగే ఎస్ జే సూర్య, రజిషా విజయన్, యోగి బాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య గురువారం (సెప్టెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది సర్దార్ 2. తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజైన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వస్తోంది. అయితే మరోసారి తన నటనతో ఆడియెన్స్ ను మెప్పించాడు కార్తీ. డబుల్ రోల్ లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా సర్దార్ 2 సినిమా రిలీజ్ నేపథ్యంలో కార్తీకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కార్తీల మధ్య చిన్నప్పటి నుంచే మంచి అనుబంధం ఉంది. అదేంటంటే? వీరిద్దరూ క్లాస్ మేట్స్. ఒకే స్కూల్ లో చదువుకున్నారు.

కాగా చాలా మంది హీరోల్లాగే మహేష్ బాబు చెన్నైలోనే పుట్టి పెరిగాడు. అక్కడే చదువు కొనసాగించాడు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు, కార్తీ కలిసి చెన్నైలోని సెయింట​ బేడ్స్‌ ఆంగ్లో ఇండియన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ సమయంలో మహేశ్‌బాబుకి కార్తీ రెండు సంవత్సరాల జూనియర్‌ అట. కాగా గతంలోనూ కార్తీ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడాడు. మహేష్ బాబు తో కలిసి తాను చెన్నైలో కలిసి చదువుకున్నామంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. కాగా ఈ ఇద్దరు స్టార్‌ హీరోలకు ఉన్న ఈ కామన్‌ కనెక్షన్‌ అభిమానులకు ఆసక్తికరంగా మారింది. సినిమాల పరంగా కాకుండా బయట కూడా మంచి స్నేహితులు కావడంతో వీళ్లకాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక మహేష్ బాబు విషయానకిఇ వస్తే.. ప్రస్తుతం దర్శకధీరుడు దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడీ సూపర్ స్టార్. గ్లోబల్ బ్యూటీ ప్రియంకచోప్రా ఇందులో కథానాయికగా చేస్తోంది. అలాగే మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2027 ఏప్రిల్‌ 7 నాటికి థియేటర్లలతో విడుదల చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి



Karthi And Mahesh Babu

Karthi And Mahesh Babu

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *