Headlines

Actor Ravi Varma: ఆ హీరో ఒక అద్భుతం.. ఆయన నటను చూస్తూ ఉండిపోయా.. టాలీవుడ్ నటుడు.. | Actor Ravi Varma Recalls Emotional Rakhi Experience with Jr NTR and Krishna Vamsi


టాలీవుడ్ నటుడు నటుడు రవి వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలి నాళ్లలో, ముఖ్యంగా తన రెండవ చిత్రం “రాఖీ”లో జూనియర్‌ ఎన్టీఆర్‌, దర్శకుడు కృష్ణవంశీలతో పనిచేసిన అనుభవాలను వివరించారు. ఈ చిత్రం తన నటన జీవితంలో ఒక కీలక మలుపు అని, కృష్ణవంశీ దర్శకత్వం, ఎన్టీఆర్‌ నటన తనకు ఎన్నో పాఠాలు నేర్పాయని ఆయన పేర్కొన్నారు. రవి వర్మ కృష్ణవంశీ “జ్ఞాన భాండాగారం”గా, “యాక్టింగ్‌ స్కూల్”గా చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వం చాలా తీవ్రంగా, బలంగా ఉంటుందని రవి వర్మ తెలిపారు. “రాఖీ” షూటింగ్ ప్రారంభంలో, కృష్ణవంశీ ఒక డైలాగ్‌ను పది రకాలుగా చెప్పమని అడిగినప్పుడు తాను ఇబ్బంది పడ్డానని రవి వర్మ గుర్తు చేసుకున్నారు. అప్పటికి కేవలం రెండవ చిత్రం కావడంతో, దేవా దర్శకత్వంలో “వెన్నెల” సినిమాలో తాను ఒక క్యారెక్టర్ డెవలప్‌మెంట్ ప్రకారం వెళ్ళే అలవాటు నుంచి, కృష్ణవంశీ గారి విధానానికి మారడానికి సమయం పట్టిందని అన్నారు. కృష్ణవంశీ గారికి తన కథకు ఏ ప్రదర్శన సరిపోతుందో తెలుసని, తాను ఆరోజు డైలాగ్‌లు ఇంటికి తీసుకెళ్లి చదువుకోమని చెప్పగా, మరుసటి రోజు ఆయన అంచనాలను అర్థం చేసుకుని మెరుగ్గా ప్రదర్శించగలిగానని రవి వర్మ వివరించారు. ఈ అనుభవం తన నటనకు గొప్ప పాఠంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటన గురించి రవి వర్మ అద్భుతమైన ప్రశంసలు కురిపించారు. “రాఖీ” చిత్రం ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే ఉత్తమ ప్రదర్శనలలో ఒకటిగా నిలిచిందని రవి వర్మ అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్‌ నటనలో “తీవ్రత” ఉంటుందని, హాస్యం, యాక్షన్, భాష, డిక్షన్, వాయిస్ వంటి అన్నింటిలోనూ అసాధారణమైన ప్రదర్శన కనబరుస్తారని ప్రశంసించారు. ప్రస్తుత తరం నటులలో చిరంజీవి గారి తరం తర్వాత, ఎన్టీఆర్‌ స్థాయిలో నటించేవారు అరుదని రవి వర్మ పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..

“రాఖీ” చిత్రంలోని ఒక సన్నివేశం గురించి రవి వర్మ మాట్లాడుతూ, అది తనను ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పారు. తన భార్య (సినిమాలో చెల్లెలు)తో కలిసి కారులో వెళుతుండగా, ఎన్టీఆర్‌ కారు వెంట పరిగెత్తుకుంటూ వచ్చి కన్నీళ్లతో “బాయ్” చెప్పే దృశ్యం అది. ఎన్టీఆర్‌ ఆ సన్నివేశంలో తన నటనతో తనను పూర్తిగా కట్టిపడేసారని, ఆ క్షణంలో తాను పెళ్ళికొడుకు పాత్రలో ఉన్నానన్న విషయాన్ని కూడా మర్చిపోయి, ఒక ప్రేక్షకునిలా ఆయన నటనను చూశానని రవి వర్మ అన్నారు. ఎన్టీఆర్‌ నటన అంటువ్యాధిలా వ్యాపిస్తుందని, అది అద్భుతమని ఆయన అన్నారు. నటుడిగా ఎన్టీఆర్‌ అద్భుతమని, వ్యక్తిగా కూడా మంచివారని రవి వర్మ తెలిపారు. ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసినప్పుడు ఆయన వృత్తిపరమైన సహకారాన్ని, వ్యక్తిగతంగానూ ఎంతో సౌకర్యంగా ఉండే వాతావరణాన్ని కల్పించారని రవి వర్మ గుర్తు చేసుకున్నారు. ఒక సన్నివేశంలో రవి వర్మ పాత్ర ఎన్టీఆర్‌ కాళ్లు పట్టుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు, ఎన్టీఆర్‌ సరదాగా “బావ ప్లీజ్ వద్దు” అని ఆట పట్టించారని, “నిన్ను థియేటర్లో నా ఫ్యాన్స్ చూసుకుంటారు” అని చమత్కరించారని రవి వర్మ వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..

రవి వర్మ, ఎన్టీఆర్

Ravi Varma, Jrntr

Ravi Varma, Jrntr

ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *