Shimron Hetmyer: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో గయానా అమెజాన్ వారియర్స్ బ్యాటర్ షిమ్రోన్ హెట్మయర్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌తో జరిగిన వర్షం ఎఫెక్ట్ మ్యాచ్‌లో కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 43 బంతులు ఎదుర్కొని అజేయంగా 111 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. అయితే, ఐపీఎల్ (IPL 2026)లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన ఈ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యాడు. ఇలాంటి విమర్శలకు నేడు బ్యాట్ తో సమాధానమిచ్చాడు. కాగా, హెట్మయర్ ధాటికి గయానా 16 ఓవర్లలో 185/5 పరుగులు చేసింది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ట్రిన్‌బాగోకు 182 పరుగుల లక్ష్యం నిర్దేశించగా, ఆ జట్టు 172/7కే పరిమితమైంది. దీంతో గయానా 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.
40 బంతుల్లోనే తుఫాన్ సెంచరీ..
వర్షం కారణంగా మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. గయానా 19/2 వద్ద ఇబ్బందుల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన హెట్మేయర్ పరిస్థితిని పూర్తిగా మార్చేశాడు. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతడు ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. చివరి ఓవర్లో సిక్సర్‌తో శతకాన్ని అందుకున్నాడు.
Viral Video: ఏం క్యాచ్ గురూ.. సూపర్‌మ్యాన్ కూడా చేతులెత్తేయాల్సిందే.. బౌండరీ లైన్లో ఒంటి చేత్తో..!
40 బంతుల్లో శతకం చేయడంతో CPLలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును హెట్మయర్ సమం చేశాడు. ఆండ్రీ రసెల్, టిమ్ సీఫర్ట్ కూడా గతంలో 40 బంతుల్లోనే ఈ ఘనత సాధించారు.
గయానాకు నాలుగో విక్టరీ..
HETMYER SHOWED UP. 🔥🇬🇾
From a quiet start to absolute carnage — Shimron Hetmyer turned the game on its head and reminded everyone what he can do when he gets going.
Pure Hettie. Pure destruction. 🥶💥
Player of the Match. Deserved. 👏#CPL2026 #ShimronHetmyer #GAW…
— 404Human | Cricket 🏏 (@404Danish_) September 1, 2026
హెట్మేయర్ 111 పరుగులతో పాటు రొమారియో షెఫర్డ్ 7 బంతుల్లో అజేయంగా 27 పరుగులు చేయడంతో గయానా 185/5కు చేరింది. లక్ష్య ఛేదనలో అలెక్స్ హేల్స్ 55 పరుగులతో పోరాడినా ట్రిన్‌బాగో 172/7 వద్ద ఆగిపోయింది. దీంతో గయానా అమెజాన్ వారియర్స్ టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. హెట్‌మయర్‌కు ఇది టీ20ల్లో రెండో శతకం కాగా, గయానా తరపున అతడి తొలి టీ20 శతకం 2018లో నమోదైంది.
Team India: 24 గంటల్లోనే మరో గాయం.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..