Headlines

Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్.. | Aishwarya Rajesh Reveals Her Huge Crush on Sushant Singh Rajput

Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్.. | Aishwarya Rajesh Reveals Her Huge Crush on Sushant Singh Rajput


ఐశ్వర్య రాజేశ్.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా గ్లామర్ రోల్స్ కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటుంది ఐశ్వర్య. అచ్చ తెలుగమ్మాయికి.. వెంకటేశ్ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయినప్పటికీ ఆమెకు తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ జనాలకు దగ్గరవుతుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఆమె తన లైఫ్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన మేనత్త తెలుగులో సీనియర్ నటి. ఆమె మరెవరో కాదు.. శ్రీలక్ష్మీ.. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హాస్యనటిగా అలరించింది. అలాగే ఐశ్వర్య తండ్రి రాజేశ్ ఒకప్పుడు తెలుగులో పెద్ద హీరో. కానీ చిన్న వయసులోనే మరణించారు.

ఇదంతా పక్కన పెడితే.. ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో ఐశ్వర్య మాట్లాడుతూ.. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌పై తనకున్న అభిమానాన్ని, క్రష్‌ను పంచుకున్నారు. అతడంటే పిచ్చి ఇష్టమని చెప్పుకొచ్చింది. హీరోయిన్‌గా పరిచయం కాకముందే సుశాంత్ అంటే తనకు చాలా ఇష్టమని, ఫ్రెండ్స్‌తో అతని గురించి చర్చించేదాన్నని ఆమె తెలిపారు. ఓసారి గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైనప్పుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఐశ్వర్య రాజేష్‌కు లభించింది. సుశాంత్‌ను చూసి ఆమె చాలా సంతోషపడ్డానని.. ఎలాగైనా అతనితో ఒక ఫోటో తీసుకోవాలని ఆశించినట్లు తెలిపింది.. ఫెస్టివల్ తర్వాత జరిగే నైట్ పార్టీకి సుశాంత్ వస్తాడని ఆశించి ఐశ్వర్య వెళ్లారు. అయితే, ఆ పార్టీకి సుశాంత్ హాజరుకాలేదు. దీంతో ఐశ్వర్య నిరాశ చెందారు. మరుసటి రోజు సుశాంత్ హోటల్ నుండి వెళ్ళిపోయారని తెలిసింది. ఆ తర్వాత తాను బస చేసిన గదికి పక్క గదిలోనే సుశాంత్ ఉన్నాడని తెలిసి ఐశ్వర్య మరింత బాధపడ్డానని చెప్పుకొచ్చింది. పక్కనే ఉన్నా కలవలేకపోయినందుకు ఆమె చాలా నిరాశ చెందినట్లు తెలిపింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అద్భుతమైన నటుడని, చాలా చిన్న వయస్సులోనే మరణించడం బాధాకరమని ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు. సుశాంత్ అంటే తనకు ఎప్పుడూ చాలా ఇష్టమని ఆమె తెలిపారు. ఇప్పటికీ తనకు అతడంటే క్రష్ ఉందని చెప్పుకొచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్..

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *