Headlines

Allu Arjun: విశాఖలో AAA సినిమాస్ ఏర్పాటు.. కొత్త ఎయిర్ పోర్ట్ పై అల్లు అర్జున్ ప్రశంసలు.. | Allu Arjun Interesting Comments On AAA Cinemas Vizag Grand Opening Event

Allu Arjun: విశాఖలో AAA సినిమాస్ ఏర్పాటు.. కొత్త ఎయిర్ పోర్ట్ పై అల్లు అర్జున్ ప్రశంసలు.. | Allu Arjun Interesting Comments On AAA Cinemas Vizag Grand Opening Event


పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విశాఖపట్నంలో AAA సినిమాస్ ఏర్పాటు చేశారు. ఆదివారం బన్నీ చేతుల మీదుగా AAA సినిమాస్ మల్టీప్లెక్స్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంగోత్రి సినిమా రోజుల్లో వైజాగ్ రోడ్డుపై తనను ఎవరూ గుర్తుపట్టేవారు కాదని.. ఇప్పుడే అదే రోడ్డుపై నడవలేకపోతున్నానని అన్నారు. ప్రస్తుతం రాకా సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుందని.. వైజాగ్ ప్రజల కోసమే ఈరోజు బ్రేక్ అడిగి వచ్చానని అన్నారు. అలాగే విశాఖపట్నం సమీపంలో కొత్త ప్రారంభమైన ఎయిర్ పోర్ట్ విషయంలో ప్రశంసలు కురిపించారు.

వైజాగ్ తనకెంతో ప్రత్యేకమైన నగరమని చెప్పారు. తన తొలి చిత్రం గంగోత్రి కాలం నుండి తాను వైజాగ్‌కు వస్తూనే ఉన్నానని, ఇక్కడ అనేక షూటింగ్‌లు, ఈవెంట్‌లలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. “వైజాగ్ నాకు చాలా, చాలా స్పెషల్ ఊరు,” అని ఆయన తెలిపారు. ఒకప్పుడు ఈ రోడ్లపై ఎవరూ గుర్తించకుండా స్వేచ్ఛగా నడిచేవాడినని, ఇప్పుడు అభిమానుల ఆదరణతో అది అసాధ్యమైందని పేర్కొంటూ, ఈ ప్రయాణం ఒక అద్భుతమని వివరించారు. AAA సినిమాస్‌కు సంబంధించి, వైజాగ్‌లో ఒక పెద్ద మాల్‌లో తన పేరు మీద ఒక ప్రతిష్టాత్మక థియేటర్ వస్తుందని కలలో కూడా అనుకోలేదని అల్లు అర్జున్ తెలిపారు. ఇది తన కల నిజమైన క్షణమని, “ఇది ఒక కల కంటే ఎక్కువ,” అని పేర్కొన్నారు. ఇన్‌ఆర్బిట్ మాల్‌ను వైజాగ్‌కు తీసుకువచ్చినందుకు ఇన్‌ఆర్బిట్ బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. మాల్ అనేది కేవలం వాణిజ్య సముదాయం కాదని, అది ఒక నగరం సంస్కృతిలో భాగమని, జ్ఞాపకాలు సృష్టించుకునే ప్రదేశమని వివరించారు. విశాఖపట్నంలో కొత్త ఎయిర్‌పోర్ట్ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని.. ఇంటర్నేషనల్ డెస్టినేషన్‌లాగా , దుబాయ్ కంటే గొప్ప నగరంగా విశాఖ మారాలని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..

AAA సినిమాస్ ప్రారంభం పట్ల తాను అత్యంత గర్వపడుతున్నానని అల్లు అర్జున్ వెల్లడించారు. ఈ థియేటర్‌లో భారతదేశంలో మరెక్కడా అందుబాటులో లేని అత్యున్నత సాంకేతికత ఉందని, వైజాగ్ ప్రజలకు ఇది తమ అంకితమని తెలిపారు. ఈ థియేటర్‌ను కేవలం వినోద కేంద్రంగా కాకుండా, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గొప్ప జ్ఞాపకాలను సృష్టించుకునే ప్రదేశంగా చూడాలని ఆయన కోరారు. “చాలా ప్రేమ, శ్రద్ధ, ఆప్యాయతతో ప్రతి చిన్న విషయంలోనూ నిమగ్నమయ్యాం,” అని వివరించారు. ఈ థియేటర్‌లోని ఒక స్క్రీన్‌కు వైల్డ్ ఫైర్ అని పేరు పెట్టినట్లు, ప్రతి స్క్రీన్‌ను వ్యక్తిగతంగా డిజైన్ చేసినట్లు ఆయన తెలిపారు. వైజాగ్ ప్రజలు ఎప్పుడూ తనను ఆశీర్వదించారని, భవిష్యత్తులో కూడా ఇదే ఆదరణ కొనసాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో AAA సినిమాస్ విజయవంతం అయిన తర్వాత వైజాగ్‌లో ఇంత పెద్ద, ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి సహకరించిన ఏషియన్ సునీల్, భరత్‌లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టులు నిర్మించాలని కోరారు. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఆర్కిటెక్ట్‌ను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఏషియన్, నారంగ్ కుటుంబాలలోని యువ తరానికి, వారి కృషికి కూడా ఆయన ప్రశంసలు అందించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *