Headlines

CWG 2026: కామన్వెల్త్ 2026లో 39 పతకాలతో భారత్ ప్రభంజనం.. విజేతలను అభినందించిన ప్రధాని | PM Modi Meets India’s CWG 2026 Medal Winners After Historic Glasgow Campaign

CWG 2026: కామన్వెల్త్ 2026లో 39 పతకాలతో భారత్ ప్రభంజనం.. విజేతలను అభినందించిన ప్రధాని | PM Modi Meets India’s CWG 2026 Medal Winners After Historic Glasgow Campaign


CWG 2026: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పతకాలు సాధించిన క్రీడాకారులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో పతకాలతో దేశ కీర్తిని చాటిన విజేతలను ప్రధాని నేరుగా కలిసి అభినందనలు తెలిపారు. మన దేశానికి చెందిన ప్రధానమైన క్రీడలు కొన్ని ఈ టోర్నీలో లేకపోయినప్పటికీ, భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి టోర్నమెంట్‌లో ఏకంగా 39 పతకాలను సొంతం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన అథ్లెట్లను ప్రధాని అభినందించి సత్కరించడం పట్ల క్రీడాకారులు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మొత్తం 39 పతకాలు సాధించి టోర్నీలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. భారత్‌కు అత్యధికంగా బాక్సింగ్ విభాగంలో ఏకంగా 7 స్వర్ణ పతకాలు రావడం విశేషం. స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించి గోల్డ్ హ్యాట్రిక్ నమోదు చేయగా, జూడో విభాగంలో కూడా భారత అథ్లెట్లు చారిత్రాత్మక పతకాలతో సంచలనం సృష్టించారు. పారా అథ్లెటిక్స్, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో కూడా భారత క్రీడాకారులు విశేషంగా రాణించారు.

స్వర్ణ పతకాలు సాధించిన విజేతలు

భారత్‌కు పసిడి పతకాలు అందించిన వారిలో పారా అథ్లెటిక్స్‌ నుంచి సోమన్ రాణా (పురుషుల షాట్ పుట్ F57), షర్మిల ధంకర్ (మహిళల షాట్ పుట్ F57), దిలీప్ గావిట్ (పురుషుల 100మీ T47) ఉన్నారు. బాక్సింగ్ విభాగంలో సాక్షి చౌదరి (51కేజీ), ప్రియ ఘాంఘస్ (60కేజీ), అరుంధతి చౌదరి (70కేజీ), సచిన్ సివాచ్ (60కేజీ), అంకుష్ పాంఘల్ (80కేజీ), ప్రీతి పవార్ (54కేజీ), జాస్మిన్ లంబోరియా (57కేజీ) స్వర్ణాలు సాధించారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను (48కేజీ), జూడో విభాగంలో అస్మిత డే (48కేజీ),హర్ష్ సింగ్ (60కేజీ) బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు.

రజత, కాంస్య పతకాల విజేతలు

రజత పతకాలు సాధించిన వారిలో వెయిట్‌లిఫ్టర్లు రుషికాంత్ సింగ్, ముత్తుపాండి రాజా, జ్ఞానేశ్వరి యాదవ్, వల్లూరి అజయ్ బాబు, హర్జిందర్ కౌర్, లవ్‌ప్రీత్ సింగ్ ఉన్నారు. అథ్లెటిక్స్ నుంచి సర్వేష్ కుషారే (హై జంప్), గుల్వీర్ సింగ్ (10000మీ), మురళీ శ్రీశంకర్ (లాంగ్ జంప్), నీరజ్ చోప్రా (జెవలిన్ త్రో), ప్రవీణ్ చిత్రవేల్ (ట్రిపుల్ జంప్), బాక్సింగ్‌ నుంచి జాదుమణి సింగ్, లవ్లీనా బొర్గోహైన్, నరేంద్ర బెర్వాల్ రజతాలు సాధించగా.. పారా విభాగంలో మహమ్మద్ బాసిల్, శుభమ్ జుయాల్ సిల్వర్ మెడల్స్ సాధించారు.

ఇక కాంస్య పతకాలను ఝండూ కుమార్ (పారా పవర్ లిఫ్టింగ్), బింద్యారాణి దేవి (వెయిట్‌లిఫ్టింగ్), గుల్వీర్ సింగ్ (5000మీ పరుగు), శిల్ప (పారా షాట్ పుట్), ఉన్నతి శర్మ (జూడో), తేజస్విన్ శంకర్ (డెకాథ్లాన్), యష్ వీర్ సింగ్ (జెవలిన్ త్రో), సెల్వా ప్రభు (ట్రిపుల్ జంప్), సీమా కాళీరామనా (డిస్కస్ త్రో) సాధించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *