Headlines

Andhra News: డబ్బుపై ఉన్న ప్రేమ భార్యపై లేదా?.. వరకట్న దాహానికి మరో వివాహిత బలి! | Kanigiri Murder: Man beats Wife Brutally to Death for Extra Dowry

Andhra News: డబ్బుపై ఉన్న ప్రేమ భార్యపై లేదా?.. వరకట్న దాహానికి మరో వివాహిత బలి! | Kanigiri Murder: Man beats Wife Brutally to Death for Extra Dowry


ముందు మాట్లాడిన ఒప్పందం ప్రకారమే అమ్మాయి తరపు వారు.. అన్ని లాంచణాలు ఇచ్చి.. పెళ్లి జరిపించారు. కానీ అత్తింటి వారికి మాత్రం అవి సరిపోలేదు.. అదనపు కట్నం కోసం ఉన్మాదుల్లా మారి ఇంటికొచ్చిన కోడలిని మధ్యలోనే మట్టుపెట్టారు. మానసికంగా వేధింపులకు గురిచేయడమే కాకుండా ఆమె భర్త, బావ కుటుంబ సభ్యులు కర్రతో కొట్టి దారుణంగా కొట్టి ఆమెను హత్య చేశారు. ప్రకాశంజిల్లా కనిగిరి అర్బన్‌ కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్తానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన గంట పీటర్ ప్రమోద్ కుమార్‌ అనే వ్యక్తి.. అదనపు కట్నం కోసం తన బంధువులతో కలిసి భార్యపై కర్రతో కిరాతకంగా దాడి చేసి హత్య చేశాడు. పీటర్‌కు మార్కాపురం పట్టణానికి చెందిన ప్రతిభా భారతితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లికి ముందే మాట్లాడినట్టు భారతీ కుటుంబ సభ్యులు అన్ని లాంఛణాలతో వివాహం జరిపించారు. అయితే డబ్బు పిచ్చి కలిగిన పీటర్ కుటుంబానికి మాత్రం ఆమె తెచ్చిన కట్నం ఏ మాత్రం సరిపోలేదు.. పెళ్లైన కొన్నాళ్లకే అదనపు కట్నం కోసం భారతిని వేధించడం స్టార్ట్ చేశారు.

ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం

అత్త, భర్త వేధింపులు చాలవు అన్నట్టు.. దీనికి అతని బావ ప్రశాంత్ కుమార్, కుటుంబ సభ్యులు కూడా తోడయ్యారు. అందరూ కలిసి భారతిని మానసికంగా కుంగదీశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా ఇటీవల జరిగిన గొడవ కారణంగా తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రమోద్‌ కుమార్ ప్రశాంత్ కుమార్ కర్ర తీసుకొని భారతి తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన భారతి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. అయితే విషయం బయటకు తెలిస్తే తమ మెడకు చుట్టుకుంటుదనే భయంతో.. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు పీటర్ ఫ్యామిలీ.. అనారోగ్యం కారణంగా భారతే తనకు తాను గోడకు తలబాదుకుని చచ్చిపోయిందని చిత్రీకరించేందుకు ప్రయత్నించారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

హత్య కేసు నమోదు

ఇక బాధితు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై హత్య కేసు నమోదు చేసుకున్న కనిగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. పాస్టర్‌గా పనిచేస్తున్న ప్రమోద్‌కుమార్‌ తన కొన్నాళ్ళుగా భార్య భారతిని అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్టు తేలడంతో ఆ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.. భారతిని కర్రలతో కొట్టి చంపిన ఘటనలో భర్త, అతని బావ ప్రశాంత్‌కుమార్‌, మరికొంతమందిపై హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు కనిగిరి ఇన్‌చార్జి డిఎస్‌పి శ్రీధర్‌ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *