Headlines

Anupama Parameswaran: అతడు చాలా స్వీట్ హార్ట్.. ప్రాబ్లమ్స్ వస్తే ఆ హీరోకే కాల్ చేస్తా.. అనుపమ పరమేశ్వరన్.. | Anupama Parameswaran Calls Dulquer Salmaan for Help and Says He Is Sweet Heart


అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిన ఈ అమ్మడు తాజాగా బ్రేకప్ గురించి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. అలాగే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ తన పాస్ట్ రిలేషన్ షిప్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తనది ఒక టాక్సిక్ రిలేషన్ షిప్ అని.. అతడు తనను టార్చర్ చేశాడని చెప్పుకోచ్చింది. ఇదెలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకు ఒక హీరో బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపింది. కష్ట సమయాలు ఎదురైనప్పుడు ఎవరిని సంప్రదిస్తారని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఆ హీరో వ్యక్తిత్వాన్ని, పరిశ్రమలో ఆయనకున్న గౌరవాన్ని స్పష్టం చేసింది. మొదట, ఏదైనా సమస్య వస్తే ఇండస్ట్రీలో ఎవరినీ సంప్రదించనని, తన మేనేజర్‌ను మాత్రమే సంప్రదిస్తానని అనుపమ పేర్కొన్నారు.

అయితే, ఇంట్లో ఎవరిని పిలుస్తారని అడిగినప్పుడు, తన సోదరుడిని సంప్రదిస్తానని ఆమె సమాధానం ఇచ్చారు. దుల్కర్ సల్మాన్ తనకెంతో ఆప్తుడని, కష్టాల్లో అండగా నిలబడతారని అనుపమ పరమేశ్వరన్ స్పష్టం చేశారు. గతంలో తాను ఆయన చిత్రం కోసం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశానని గుర్తు చేసుకున్నారు. “ఆయనొక స్వీట్‌హార్ట్,” అని దుల్కర్‌ను అభివర్ణిస్తూ, “ఏదైనా సమస్య ఉంటే, నేను ఖచ్చితంగా దుల్కర్ సల్మాన్‌ను సహాయం కోసం అడగగలను, అవును” అని బలంగా చెప్పారు.

ఇదే ప్రశ్నకు ఇతర బృంద సభ్యులు కూడా ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. నటుడు రోషన్, “ఐ డోంట్… రోషన్ చాలా కాలం నుండి స్నేహితుడు. అతను కూడా పరిశ్రమలోనే ఉన్నాడు, కాబట్టి, నాకు ఏదైనా అవసరమైతే నేను పిలిచే వ్యక్తి అతను. ఇప్పుడు నేను ఏమి చేయాలి? అతను నా వ్యక్తి.” అని తన సన్నిహితుడి గురించి వివరించారు. మరో బృంద సభ్యుడు, పరిశ్రమలో సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని సంప్రదిస్తారని అడిగినప్పుడు, “అది మా వైఫ్‌కి కాల్ చేస్తారమ్మా” అని నవ్వుతూ చెప్పారు. ఆమె కూడా పరిశ్రమలోనే ఉన్నారని, దర్శకురాలని వివరించారు. ఈ సంభాషణ పరాధ బృందం మధ్య ఉన్న సరదా వాతావరణాన్ని, అలాగే వారి వ్యక్తిగత అనుబంధాలను తెలియజేసింది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..

 దుల్కర్ సల్మాన్ పోస్ట్..

 ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *