Gold: నగల రూపంలో గోల్డ్ కొంటున్నారా..? ఇది తెలిస్తే మీరు ఇంకోసారి తప్పు చేసే ఛాన్స్ ఉండదు.. | Gold Investment: Is Buying Jewellery Better or Should You Invest in Gold ETFs, Bonds & Mutual Funds
బంగారం అంటే ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. మహిళలు, పురుషులు అనే సంబంధం లేకుండా.. గోల్డ్‌ను అందరూ ఇష్టపడతారు. ఇక ప్రపంచంలోనే భారతీయులకు బంగారం అంటేనే ఒక ప్రత్యేక సెంటిమెంట్ అని చెప్పవచ్చు. దీంతో ప్రతీఒక్కరి ఇళ్లల్లో తప్పనిసరిగా ఎంతోకొంత గోల్డ్ అనేది ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో వీటిని విక్రయించి తమ ఆర్ధిక అవసరాలను తీర్చుకుంటారు. ఇక పెళ్లిళ్లు, పండుగలు లాంటివి వస్తే బంగారం ధరించి మురిసిపోతుంటారు. కొంతమంది ధరించేందుకు కొనుగోలు చేస్తే.. మరికొంతమంది ఇప్పుడు కొంటే భవిష్యత్తులో…