Headlines

Folk Song : ‏ఈపాట డీజేలో వింటే ఉంటది రా చారి.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. | Check this trending Million Views telugu folk song on youtube, it is Thangedu Chetla Kinda


ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియా ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి తెలంగాణ ఫోక్ సాంగ్స్. అచ్చమైన పల్లె పదాలతో.. మట్టి వాసన, గ్రామీణ వాతావరణంతో రూపొందించిన పాటలు ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. కొన్నాళ్లుగా ఫోక్ సాంగ్స్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో చెప్పక్కర్లేదు. చాలా మందికి పదాలకు అర్థం తెలియకపోయినప్పటికీ ఈ పాటలకు స్టెప్పులేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రాను బొంబాయికి రాను పాట ప్రపంచవేదికపై అలరించింది. మొన్నటివరకు శనిగే షేన్ల నిలబడి, బాసింగ బాసింగ బలాలు, రాతిరి రాతిరి పాటలు మిలియన్ వ్యూస్ అందుకుంటూ దుమ్మురేపాయి. ఇక ఇప్పుడు మరో కొత్త ఫోక్ సాంగ్ తెగ వైరలవుతుంది. ఎక్కడ చూసిన ఈ పాటకు స్టెప్పులేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న పాట ఏంటో తెలుసుకుందామా. అదేనండి.. “తంగేడు చెట్ల కింద” (Thangedu Chetla Kinda) జానపద గీతం. ఈ పాట ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

ఈ పాట పూర్తి స్థాయిలో తెలంగాణ గ్రామీణ నేపథ్యం, ప్రేమికుల మధ్య ఆత్మీయ సంభాషణల చుట్టూ సాగుతుంది. “తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో.. తలువాలు పోసుకుందాం” అంటూ సాగే ఈ పాట శ్రోతలకు హుషారైన అనుభూతిని ఇస్తుంది . పాటలో హీరోహీరోయిన్లు తమ వైవాహిక జీవితం, తమ భవిష్యత్తు గురించి, పెళ్లి గురించి, అలాగే సంతానం కలిగితే కొమురవెల్లి మల్లన్న, రేణుకా ఎల్లమ్మ దేవుళ్ల బోనాలు తీస్తామని సమర్పించే మొక్కుబడుల గురించి ఎంతో అందంగా పాడుకుంటారు. కట్నకానుకలు లేకుండా, ఎలాంటి అడ్డంకులు లేకుండా పెళ్లి చేసుకుని ఒకటవ్వాలనే తమ ప్రేమను తెలియచేసుకుంటారు.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

ఈ పాటలో సింగర్ ప్రభ, గడ్డం సంతోషంగా ఎంతో హుషారుగా ఆలపించారు. అలాగే అక్కి చెర్రీ, మౌనిక డింపుల్ తమ ఎనర్జిటిక్ స్టెప్పులతో అల్లాడించారు. ఇక శేఖర్ వైరస్ అందించిన కొరియోగ్రఫీ ఈ పాటకు హైలెట్ అని చెప్పాలి. ఈ పాట విడుదలైన స్వల్ప వ్యవధిలోనే యూట్యూబ్‌లో వేల సంఖ్యలో వ్యూస్ దక్కించుకుంటూ ట్రెండింగ్‌లో నిలిచింది. సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ స్టేటస్‌లలో ఈ పాట క్లిప్స్ వైరల్ అవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

తంగేడు చెట్ల కింద సాంగ్..



ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *