ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఒకే టికెట్‌తో బస్సు, ఆటో సేవలు.. ఆర్టీసీ సరికొత్త ప్రయోగం! | Good news for passengers from TGSRTC: Electric auto services coming soon in Hyderabad
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేలా త్వరలో ఎలక్ట్రిక్ ఆటో సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారు. ఎలక్ట్రిక్ ఆటో తయారీ సంస్థలతో చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఈ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ‘ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ’…