Headlines

Best Bike: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఏదో తెలుసా..? మరోసారి అగ్రస్థానంలో..! | Auto News: Hero splendor dominates indian market as best selling bike in july 2026


Best Selling Bike: భారతదేశంలోని రహదారులు ప్రస్తుతం కార్లు, బైక్‌లతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది జూలై నెలలో దేశంలో బైక్ అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. దేశీయ బైక్ అమ్మకాలు 19,23 లక్షల యూనిట్లను దాటాయి. గత ఏడాది జూలైలో అమ్ముడైన 15,69 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 22.6 శాతం పెరుగుదల.

జూలై 2026లో మొత్తం అమ్మకాలు 2.477 మిలియన్ యూనిట్లను అధిగమించాయి. ఇది గతేడాదితో పోలిస్తే 23.7 శాతం వృద్ధిని సూచిస్తుంది. దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ ఎంట్రీ-లెవల్ బైక్ అయిన స్ప్లెండర్, జూలై 2026లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 ద్విచక్ర వాహనాల జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.

ఇది కూడా చదవండి: Home Loan: రూ.50,000 జీతానికి ఎంత హోమ్ లోన్ EMI కట్టవచ్చు? లోన్ టెన్షన్ లేకుండే సింపుల్ ఫార్ములా!

ఇవి కూడా చదవండి



అత్యధికంగా అమ్ముడైన హీరో స్ప్లెండర్:

హీరో స్ప్లెండర్ భారతదేశంలో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌గా నిలిచింది. ఆసక్తికరంగా ఈ బైక్ ధర కేవలం రూ. 77,777 నుండి ప్రారంభమవుతుంది. సమాచారం ప్రకారం, కంపెనీ ఈ బైక్‌ను త్వరలో కొత్త అప్‌గ్రేడ్‌లతో మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

హీరో స్ప్లెండర్ అమ్మకాలు 35.9 శాతం పెరిగాయి:

జూలై 2026లో హీరో స్ప్లెండర్ అద్భుతమైన పనితీరును కనబరిచింది. జూలై 2025లో 2,46,715 యూనిట్లు అమ్ముడవగా, జూలై 2026 నాటికి ఈ సంఖ్య 3,35,346 యూనిట్లకు చేరుకుంది. అంటే, ఈ ఏడాది అమ్మకాలలో ఏకంగా 35.9 శాతం పెరుగుదల నమోదైంది. హీరో స్ప్లెండర్‌లో 97.2 సిసి ఇంజన్ ఉంది.

హోండా యాక్టివా రెండవ స్థానంలో

హోండా యాక్టివా 2,06,170 యూనిట్ల అమ్మకాలతో రెండవ స్థానంలో నిలిచింది. అయితే, ఈ ఏడాది దాని అమ్మకాలు 13.1 శాతం తగ్గాయి. జూలై 2025లో యాక్టివా 2,37,413 యూనిట్లను విక్రయించింది. అమ్మకాలు తగ్గినప్పటికీ, యాక్టివా టాప్ 10లో తన రెండవ స్థానాన్ని నిలబెట్టుకుంది.

హోండా షైన్ అమ్మకాలు పెరిగాయి:

హోండా షైన్ కూడా తన మూడవ స్థానాన్ని నిలబెట్టుకుంది. జూలై 2026లో ఈ బైక్ 1,91,950 యూనిట్లు అమ్ముడవగా, జూలై 2025లో ఈ సంఖ్య 1,59,658 యూనిట్లుగా ఉంది. అంటే ఈ ఏడాది షైన్ అమ్మకాలు 20.2 శాతం పెరిగాయి. దీని తర్వాత టీవీఎస్ జూపిటర్ నాలుగో స్థానంలో ఉండగా, సుజుకి యాక్సెస్ ఐదో స్థానంలో ఉంది. 66,156 యూనిట్ల అమ్మకాలతో బజాజ్ పల్సర్ ఆరో స్థానంలో ఉండగా, టీవీఎస్ అపాచీ ఏడో స్థానంలో ఉంది.

ఇది కూడా చదవండి: Compound Wall Cost: తక్కువ ధరల్లో 100 అడుగుల కాంపౌండ్ వాల్‌ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *