Headlines

Bigg Boss 10: అగ్నిపరీక్ష 2లోకి సోషల్ మీడియా సెన్సేషన్.. హౌస్‌లో ఇక రచ్చ రచ్చ | Uppal Balu attends auditions for Bigg Boss Telugu Agnipariksha Season 2, watch viral video

Bigg Boss 10: అగ్నిపరీక్ష 2లోకి సోషల్ మీడియా సెన్సేషన్.. హౌస్‌లో ఇక రచ్చ రచ్చ | Uppal Balu attends auditions for Bigg Boss Telugu Agnipariksha Season 2, watch viral video


బిగ్ బాస్ సీజన్ 9 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే సీజన్ 10పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈసారి ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునేలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఇక సీజన్ 10 దర్శవతారం అంటూ సందడి చేయనున్నారు. మైల్ స్టోన్ సీజన్ కావడంతో ప్రేక్షకుల అంచనాలను మించి ఉండేలా బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేస్తుంది. కాగా గత సీజన్ నుంచి అగ్నిపరీక్ష అంటూ సామాన్యులను సెలక్ట్ చేసే ప్రాసెస్ మొదలు పెట్టారు. సెలబ్రెటీలతో పాటు సామాన్యులకు కూడా బిగ్ బాస్ హౌస్ లో అవకాశం కలిపిస్తున్నారు. ఈసారి కూడా అగ్నిపరీక్ష ఉండనుంది. సామాన్యులుగా వచ్చి బిగ్ బాస్ వినర్స్ అయినా వారు ఉన్నారు, సీజన్ 7లో రైతు బిడ్డ పల్లవిప్రశాంత్ , సీజన్ 9లో కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యారు.

దాంతో సామాన్యులు కూడా బిగ్ బాస్ సీజన్ 10లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్రమంలోనే అగ్నిపరీక్ష సీజన్ 2ను మొదలుపెట్టనున్నారు. ఆగస్టు 15నుంచి బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 మొదలు కానుంది. అయితే ఈసారి అగ్నిపరీక్ష ఆడిషన్స్ కాస్త గట్టిగానే జరుగుతున్నాయని తెలుస్తుంది. తాజాగా అగ్నిపరీక్ష ఆడిషన్స్ కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో అగ్నిపరీక్ష ఆడిషన్ కు ఉప్పల్ బాలు పాల్గొన్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ వీడియో ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ గా మారింది. ఉప్పల్ బాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా వాడే ప్రతిఒక్కరికి ఇతను సుపరిచితుడే.. టిక్ టాక్ నుంచి ఇప్పటి ఇన్ స్టా రీల్స్ వరకు ఉప్పల్ బాలు విపరీతమైన కేజ్ సొంతం చేసుకున్నాడు. చిత్రవిచిత్రమైన వీడియోలు చేస్తూ నెట్టింట సందడి చేశాడు ఉప్పల్ బాలు. ఇక ఇప్పుడు బాలు బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఆడిషన్స్ కు వెళ్లినట్టు ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ఈ ఈవీడియోకు నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు సెలబ్రేటీవి అన్న అని కొందరు, మరికొందరు అల్ ది బెస్ట్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరో ఉప్పల్ బాలు ఈసారి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తాడేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *