Headlines

BITS పిలానీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఆగస్టు 15లోపు అప్లై చేయండి.. రాత పరీక్ష లేదు | BITS Pilani Hyderabad Recruitment 2026: Apply for Research Fellow Posts before August 15

BITS పిలానీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఆగస్టు 15లోపు అప్లై చేయండి.. రాత పరీక్ష లేదు | BITS Pilani Hyderabad Recruitment 2026: Apply for Research Fellow Posts before August 15


ప్రముఖ విద్యాసంస్థ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) హైదరాబాద్ క్యాంపస్ వివిధ పరిశోధన ప్రాజెక్టుల కోసం జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF), పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో (Post Doctoral Research Fellow) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పరిశోధనా రంగంలో ఆసక్తి ఉన్న అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF), పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో (PDF) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు BITS హైదరాబాద్ క్యాంపస్‌లో కొనసాగుతున్న వివిధ రీసెర్చ్ ప్రాజెక్టుల కోసం చేపడుతున్నారు.

బిట్స్ హైదరాబాద్ క్యాంపస్‌లో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి సంబంధిత విభాగంలో బీఈ / బీటెక్, పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత పరిశోధనా అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉండవచ్చు. ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీగా ఆగస్టు 15, 2026వ తేదీని నిర్ణయించారు. అభ్యర్థులు గడువు తేదీలోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ ఇలా..

ఎలాంటి రాత పరీక్షలేకుండానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇందులో భాగంగా దరఖాస్తుల పరిశీలన (Application Screening), ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి నోటిఫికేషన్, దరఖాస్తు విధానం, ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. పరిశోధనా రంగంలో కెరీర్‌ను కొనసాగించాలనుకునే ఇంజినీరింగ్, సైన్స్ విభాగాల అభ్యర్థులకు ఈ నియామకాలు మంచి అవకాశం కానున్నాయి.

బిట్స్ హైదరాబాద్ క్యాంపస్‌లో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *