మారుతి సుజుకి సెలెరియో: ఈ జాబితాలో మైలేజ్ పరంగా ప్రత్యేకంగా నిలిచే మరో కారు మారుతి సుజుకి సెలెరియో. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.70 లక్షలు. పెట్రోల్ వెర్షన్ 24.97 నుండి 26.68 కి.మీ/లీ మైలేజీని అందిస్తుంది. సీఎన్‌జీ మోడల్ 34.43 కి.మీ/కేజీ మైలేజీని అందిస్తుందని చెబుతున్నారు. తక్కువ ధర, మంచి మైలేజ్, రోజువారీ వాడకాన్ని పరిగణనలోకి తీసుకుంటే, కారు కొనాలనుకునే వారికి ఈ మోడళ్లు బడ్జెట్‌కు అనుకూలమైన ఎంపికలుగా ఉంటాయి. వేరియంట్, ఇంధన రకం, డ్రైవింగ్ వాతావరణాన్ని బట్టి వాస్తవ మైలేజ్ మారవచ్చు.