Headlines

Business Ideas: రూ. 50 వేల పెట్టుబడితో ఇంటి నుంచే వ్యాపారం.. నెలకు లక్షల్లో సంపాదనకు బెస్ట్ ఐడియా! | Business Ideas: Dona pattal business starts with Rs 50,000 only know how it works

Business Ideas: రూ. 50 వేల పెట్టుబడితో ఇంటి నుంచే వ్యాపారం.. నెలకు లక్షల్లో సంపాదనకు బెస్ట్ ఐడియా! | Business Ideas: Dona pattal business starts with Rs 50,000 only know how it works


Business Ideas: మీ ఉద్యోగంతో మీరు విసుగు చెందారా? మీ బాస్ సతాయింపు, పని ఒత్తిడి, నిరంతరం ఎవరికో ఒకరికి జవాబు చెప్పాల్సి రావడంతో విసిగిపోయారా? అయితే వ్యాపారం ప్రారంభించడమే ఉత్తమం. వ్యాపారం ప్రారంభించడం అంత సులభం కానప్పటికీ, ఒక మంచి ఆలోచన ఉంటే ఏదైనా సాధ్యమే. పెట్టుబడి పెట్టడానికి మీ వద్ద ఎక్కువ డబ్బు లేకపోయినా, కేవలం 50,000 రూపాయలతో మిమ్మల్ని ధనవంతులను చేయగల ఒక అద్భుతమైన బిజినెస్‌ ఉంది. దాని గురించి తెలుసుకుందాం.. ఈ వ్యాపార ఆలోచన కోసం మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం ఒక యంత్రం, కొంత వ్యర్థ పదార్థంతో దీనిని ఇంట్లోనే ప్రారంభించవచ్చు.

ఏంటా వ్యాపారం?

అదే పేపర్ దోనా-పత్తల్ (పేపర్ ప్లేట్లు, విస్తరాకులు, పేపర్ కప్పుల) తయారీ వ్యాపారం. ఈ ఉత్పత్తులకు ఏడాది పొడవునా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. పెళ్లిళ్లు, బర్త్‌డే పార్టీలు, శుభకార్యాలు, పూజలు, రెస్టారెంట్లు, వీధి పక్కన ఉండే స్ట్రీట్ ఫుడ్ స్టాళ్లలో డిస్పోజబుల్ ప్లేట్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్‌పై నిషేధం, పర్యావరణ స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో కాగితంతో చేసే ఉత్పత్తులకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది.

మీకు ఏ సామాగ్రి అవసరం అవుతుంది?

దీని కోసం యంత్రం, స్క్రాప్ పేపర్ లేదా ఫుడ్-గ్రేడ్ పేపర్, గ్లూ, మరికొన్ని చిన్న సామాగ్రి అవసరం అవుతాయి. యంత్రం సామర్థ్యాన్ని బట్టి దాని ధర మారుతుంది. మీరు చిన్నగా ప్రారంభించి, ఆర్డర్లు పెరిగే కొద్దీ ఉత్పత్తిని పెంచుకోవచ్చు. మీరు కేవలం 50,000 రూపాయల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు . దీని కోసం బడ్జెట్‌ను ఎలా రూపొందించుకోవాలో, ప్రారంభ, నెలవారీ ఖర్చులు ఎంత అవుతాయో తెలుసుకుందాం. అన్నిటికంటే ముందుగా ప్లేట్స్‌ తయారు చేయడానికి ఒక సెమీ-ఆటోమేటిక్ యంత్రాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికి సుమారు 28 వేల రూపాయల నుండి 35 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదవండి: Minimum Balance: ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయలేదా?.. పెనాల్టీల రూపంలో బ్యాంకులు భారీగా వసూళ్లు..!

దీని తర్వాత, పేపర్ రోల్/పేపర్ షీట్ వంటి ముడి పదార్థాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికి కేవలం రూ. 8 వేల నుండి రూ. 10 వేల వరకు ఖర్చు అవుతుంది. అలాగే దీని తర్వాత, మీరు వివిధ సైజులలో లభించే డైని కొనుగోలు చేయాలి. దీని ధర రూ. 3 వేల నుండి రూ. 5 వేల మధ్య ఉంటుంది. తయారీ తర్వాత వస్తువులను అమ్మడానికి ప్యాకింగ్ మెటీరియల్ కూడా కొనవలసి ఉంటుందిజ దీనికి సుమారు రూ. 2 వేలు ఖర్చవుతుంది. చివరగా, విద్యుత్, ఇన్‌స్టాలేషన్, ఇతర చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. వీటికి రూ. 3,000 నుండి రూ. 5,000 వరకు అవుతుంది. అదే విధంగా, 50 వేల రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

మీ నెలవారీ ఖర్చులు ఎంత ఉంటాయి?

  • మీరు మీ వ్యాపారాన్ని ఇంటి నుండే ప్రారంభిస్తే, అద్దె చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల మీ నెలవారీ ఖర్చులు కూడా కొంతమేర తగ్గుతాయి.
  • ఒక నెలకు సరిపడా ముడిసరుకుకు సుమారు 20 నుండి 30 వేల రూపాయలు ఖర్చవుతుంది.
  • నెలవారీ విద్యుత్ బిల్లు సుమారు 1 నుండి 2 వేల రూపాయల వరకు ఉంటుంది (ఇది మీ ప్రాంతంలోని యూనిట్లపై కూడా ఆధారపడి ఉంటుంది).
  • ఇది కాకుండా, ప్యాకింగ్, రవాణా ఖర్చు రూ. 2 నుండి 3 వేలు అవుతుంది. అలాగే కొన్ని చిన్న ఖర్చులు సుమారుగా రూ. 2 వేలలో భర్తీ అవుతాయి.
  • ఇలాంటి పరిస్థితిలో, ఈ వ్యాపారంలో ప్రతి నెలా మొత్తం రూ. 25 నుండి 35 వేల వరకు ఖర్చు అవుతుంది.
Business News

Business News

సమయం మరియు సంపాదన:

ఈ వ్యాపారానికి రోజుకు 5 నుండి 6 గంటలు సమయం కేటాయిస్తే సరిపోతుంది. మన వీలును బట్టి ఏ సమయంలోనైనా పని చేసుకోవచ్చు. మార్కెటింగ్‌పై దృష్టి పెట్టి మంచి కస్టమర్లను సంపాదించుకుంటే, నెలకు రూ. 30,000 నుంచి లక్షల్లో ఆదాయం పొందే అవకాశం ఉందని వ్యాపారులు సూచిస్తున్నారు.

మీ సరుకులను ఎక్కడ అమ్ముకోవచ్చు?

ఈ ప్లేట్స్, విస్తరాకుల వ్యాపారం ఏడాది పొడవునా సాగేది. ఈ రోజుల్లో పెళ్లిళ్లు, పార్టీలు, మతపరమైన కార్యక్రమాలు, వీధి ఆహార దుకాణాలు, క్యాటరింగ్‌లో డిస్పోజబుల్ విరివిగా ఉపయోగిస్తున్నారు. పెరుగుతున్న పర్యావరణ అవగాహన కాగితం, ఆకు ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచింది. అందువల్ల, మీరు వాటిని స్వీట్ షాపులు, హోటళ్లు, క్యాటరర్లు లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అమ్ముకోవచ్చు.

మీకు మంచి కస్టమర్లు దొరికితే, ఈ చిన్న వ్యాపారం లక్షల రూపాయలను సంపాదించి పెట్టగలదు. అంతేకాకుండా, మీరు ప్రతిరోజూ 5 నుండి 6 గంటలు మాత్రమే కేటాయించాల్సి ఉంటుంది. మీరు 9 గంటల ఆఫీస్ షిఫ్ట్ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. అంతేకాక, మీరు ఎప్పుడు పని ప్రారంభించాలనుకుంటున్నారో మీ స్వంత షెడ్యూల్‌ను మీరే ఎంచుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *