Headlines

Career Astrology: వారికి నీచభంగ రాజయోగం..! 55 రోజులు కెరీర్‌లో ఊహించని పురోగతి | Mars Transit 2026: 6 Zodiac Signs Set for Unexpected Success, Power and Financial Gains


ఈ నెల(సెప్టెంబర్) 18 నుంచి నవంబర్ 12 వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగు తుంది. కర్కాటక రాశి కుజుడికి నీచ స్థానం. అయితే, కుజుడికి ఈ రాశి మిత్ర స్థానం కూడా. కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో యుతి చెందడం వల్ల కుజుడికి నీచభంగం జరుగుతుంది. ఫలితంగా కుజుడు మిత్ర క్షేత్ర ఫలితాల్ని మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. సుమారు 55 రోజుల కర్కాటక రాశి సంచారంలో కుజుడు మేషం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులను కలలో కూడా ఊహించని విధంగా అందలాలు ఎక్కించే అవకాశం ఉంది. ప్రయత్నానికి, చొరవకు, తెగువకు, సాహసానికి కారకుడైన కుజుడు ఈ రాశులకు అధికారం, ఆదాయం ఇస్తాడు.

మేషం

ఈ రాశికి అధిపతి కుజుడే అయినందువల్ల కుజుడి కారకత్వాలన్నీ ఈ రాశికి పూర్తిగా వర్తిస్తాయి. ఈ రాశివారు ఉద్యోగంలో పదోన్నతికి, ఆదాయం పెరగడానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. వీరి ప్రయత్నాలన్నీ తప్పకుండా విజయవంతమవుతాయి. ఆస్తిపాస్తులు బాగా కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సఫ లమవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఘన విజయాలు సాధిస్తాయి. ఆరోగ్యానికి లోటుండదు.

కర్కాటకం

ఈ రాశిలో ప్రవేశించిన కుజుడు ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో కలవడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. పట్టుదలగా ప్రయత్నించడం, అనుకున్నది సాధించడం వంటి లక్షణాలున్న వీరికి ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలు విజయాలు, సాఫల్యాలతో సాగిపోతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా లభిస్తాయి. ఉద్యోగులు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి



తుల

ఈ రాశికి దశమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో కుజుడుకలవడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా రాజయోగాలు, రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపుతో పాటు ధన లాభం కూడా కలుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల నెరవేరుతుంది. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఉద్యోగు లకు డిమాండ్ పెరిగి, ఉన్నత పదవులు లభిస్తాయి. ధనధాన్య సమృద్ధి యోగం కలుగుతుంది..

వృశ్చికం

రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో కలవడం వల్ల మనసులోని కోరికలు, ఆశలు నెరవేరుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ సంపాదన యోగం పడుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా తరచూ విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.

మకరం

ఈ రాశికి సప్తమ స్థానంలో గురు, కుజుల కలయిక ఈ రాశివారికి అత్యంత శుభప్రదమైనది. అనేక విధాలుగా అదృష్టాలు కలుగుతాయి. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలోపడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అను కూలంగా పరిష్కారం అవుతాయి. భూ లాభం, ఆస్తి లాభం కలుగుతాయి.. షేర్లు బాగా లాభిస్తాయి.

మీనం

రాశ్యధిపతి గురువుతో కుజుడు పంచమ స్థానంలో కలవడం వల్ల ఈ రాశివారికి దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. మనసులో ఏ కోరిక కోరుకున్నానెరవేరుతుంది. ప్రేమ వ్యవహారాలు, పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. సంతాన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ నూరు శాతం సత్ఫలితాలనిస్తాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. వివాదాలు, సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *