లైకోపిన్ క్యాన్సర్‌ను నిరోధించడంలో, కణాలను శుభ్రపరచడంలో, DNA మ్యూటేషన్‌ను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ వంటి వాటిలో ఇది చికిత్సకు తోడ్పడుతుంది. టమోటాలు, పుచ్చకాయ, బొప్పాయి వంటి సహజ ఆహారాల ద్వారా లైకోపిన్‌ను పుష్కలంగా పొందవచ్చు. ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించి, సహజసిద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు.
మన శరీరంలోని కణాల ఆరోగ్యానికి, ముఖ్యంగా క్యాన్సర్ నివారణకు ఎంతగానో దోహదపడుతుంది. మనం తీసుకునే ఆహారంలో లైకోపిన్ సమృద్ధిగా ఉంటే, అది మన కణాలను క్యాన్సర్ బారి నుండి రక్షించడంలో, కణాల శుభ్రతను కాపాడటంలో, అలాగే కణం లోపల ఉండే DNAను మ్యూటేషన్ చెందకుండా నిరోధించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
ఖరీదైన సప్లిమెంట్ల మీద ఆధారపడకుండా, సహజసిద్ధమైన ఆహారాల వలన లైకోపిన్‌ను పుష్కలంగా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. లైకోపిన్ అధికంగా లభించే కొన్ని ఆహారాలు ఇవే. టమోటాలు, పుచ్చకాయ, 5 మిల్లీగ్రాములు, బొప్పాయి, ద్రాక్ష 4 మిల్లీగ్రాములు , పచ్చిమిరపకాయలు 1.5 మిల్లీగ్రాములు, తోటకూర 0.5 మిల్లీగ్రాములు.
లైకోపిన్ బాయిలింగ్ పాయింట్ 660 డిగ్రీల వరకు ఉంటుంది. సాధారణంగా వండినప్పుడు దాని శాతం కొద్దిగా తగ్గుతుంది కానీ ఎక్కువగా నశించదు. అయితే, నూనెలో వేయించడం, అధిక వేడికి గురిచేయడం వల్ల లైకోపిన్ నశించే అవకాశం ఉంది. కాబట్టి, లైకోపిన్‌ను ఎక్కువగా పొందాలంటే వీలైనంత వరకు పచ్చిగా ఇంకా తక్కువ వేడితో వండిన ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. ఉదాహరణకు, టమోటాలను వెజిటబుల్ జ్యూస్‌లో కలుపుకోవడం, అర కిలో బొప్పాయి, పుచ్చకాయలను తినడం వంటి పద్ధతులు మంచి ఫలితాలనిస్తాయి.
ప్రస్తుత సమాజంలో వేపుడు కూరలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఓవెన్స్‌లో తయారుచేసిన వంటకాలు తినడానికి అలవాటు పడుతున్నాం. ఇవి మన కణాల DNAలో మ్యూటేషన్స్ కు దారితీసి, భవిష్యత్తులో మంచి కణం కూడా క్యాన్సర్ కణంగా మారే ప్రమాదాన్ని పెంచుతాయి. అందువల్ల, ప్రతిరోజూ వీలైనంత వరకు సహజసిద్ధమైన, పచ్చి ఆహారాలను తీసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడప్పుడు ఏదైనా సందర్భంలో మాత్రమే ఉడికిన ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం మంచిది. కనీసం 365 రోజులలో 330-340 రోజులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చు.




