మల్లన్న భక్తులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జస్ట్ రూ.25తో హైదరాబాద్ టూ కొమరవెళ్లి ప్రయాణం! | Komuravelli Railway Station Opens: Easier Pilgrimage to Mallanna Temple from Hyderabad
కొమురవెల్లి మల్లన్న ఆలయానికి మరో కొత్త శోభ వచ్చింది. రూ.6 కోట్ల వ్యయంతో కొమురవెల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వేస్టేషన్‌ను కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా మొదటి టికెట్ కొనుగోలు చేసి, తొలి ప్రయాణికుడిగా ట్రైన్ ఎక్కి గజ్వేల్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మక ఘట్టం అన్నారు. రెండేళ్లలోనే రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తి చేసుకుని.. ప్రారంభించుకోవడం జరిగిందని గుర్తు చేశారు. కొమురవెల్లి…