Headlines

Cinema OTT: ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే.. | Naga Durga Latest Super Hit Movie Love Oh Love OTT Streaming Date Announced

Cinema OTT: ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే.. | Naga Durga Latest Super Hit Movie Love Oh Love OTT Streaming Date Announced


తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్, సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది నాగదుర్గ. అందమైన రూపం, ఆకట్టుకునే డ్యాన్స్ పాటలతో తక్కువ సమయంలో పాపులర్ అయ్యింది. ఇప్పటివరకు వందల పాటలలో నటించిన ఆమె.. ఇప్పుడిప్పుడే కథానాయికగా వెండితెరపై మెరిసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే కవలి వనం అనే చిత్రంలో నటించింది నాగదుర్గ. ఈ మూవీ గతేడాది థియేటర్లలో విడుదలైంది కానీ.. జనాలకు అంతగా తెలియదు. ఇక ఇప్పుడు యంగ్ హీరో ప్రియదర్శి జోడిగా ఇడుపు కాయితం అనే సినిమాలో నటిస్తుంది. ఇటీవలే రిలీజ్ అయిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కంటే ముందే తమిళంలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది నాగదుర్గ. ధనుష్ మేనల్లుడు పవిష్ సరసన నటించి మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..

ధనుష్ మేనల్లుడు పవిష్ హీరోగా నటించిన సినిమా లవ్ ఓ లవ్. ఇందులో నాగదుర్గ హీరోయిన్ గా నటించింది జూలై 10న తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఈనెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. ఎంతో ఫోర్స్ చేశా.. కానీ ఇప్పుడు పెద్ద నటుడు అయ్యాడు.. కృష్ణ వంశీ..

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రఘు ( పవిష్) , అవంతిక (నాగ దుర్గ) ఇద్దరు లవర్స్. అయితే ప్రేమలో పడిన తర్వాత సినిమాలు, షికార్లు, షాపింగ్ పేరుతో రఘు డబ్బులన్నీ అవంతిక ఖర్చు చేస్తుంది. చివరకు అతడు క్రెడిట్ కార్డ్స్, అప్పులు తీసుకునేలా చేస్తుంది. దీంతో రఘు పోలీస్ స్టేషన్ చేరుకున్న రఘు.. తనకు బ్రేకప్ కావాలని.. అందుకు లెటర్ పై సంతకం చేయాలని .. లేదంటే నాలుగు నెలలు తన స్థానంలో ఉండి తను చేసినవన్నీ చేయాలని అడుగుతాడు. దీంతో అవంతిక రఘును చూసుకుంటానని చెబుతుంది. ఆ తర్వాత ఏమైందనేది సినిమా.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బి‏గ్ బాస్‏లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..

ఎక్కువ మంది చదివినవి : Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *