నిజానికి ఇది తమిళ సినిమా. కానీ తెలుగు డబ్బింగ్ సైతం అందుబాటులో ఉంది. కథలోని మలుపులు ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేయడంతో, ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ‘కన్నై నామతే’ చిత్రానికి ఎం. మారన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించగా, ప్రసన్న, భూమిక, శ్రీకాంత్ అనేక ఇతర కళాకారులు ఇందులో నటించారు. ఇది ప్రధానంగా ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఒక సాధారణ వ్యక్తి అనుకోకుండా ఒక హత్య కేసులో ఎలా చిక్కుకుంటాడో ఈ సినిమా వివరిస్తుంది.