తెలుగు సినీ పరిశ్రమలో తన విలక్షణ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నవరస నటనా సార్వభౌమ రాజేంద్ర ప్రసాద్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, యువతారలతో అనుబంధం, తనను తీర్చిదిద్దిన కీలకమైన పాఠాల గురించి ఆయన పలు విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా అనుభవాలను రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబుతో దాదాపు 90 రోజులకు పైగా పని చేయడం తన కెరీర్‌లోని అద్భుతమైన అనుభవాలలో ఒకటిగా ఆయన అభివర్ణించారు. “మహేష్‌తో కలిసి పని చేయడం ఒక లవ్లీ ఎక్స్‌పీరియన్స్. అంతకాలం కలిసి పని చేసినప్పుడు ఒకరి గురించి ఒకరికి చక్కటి అవగాహన వస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
కేవలం మహేష్ బాబు మాత్రమే కాకుండా, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి యువ నటులతో కూడా తనకు గొప్ప అనుబంధం ఉందని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించిన నాన్నకు ప్రేమతో చిత్రంలోని పాట ఇప్పటికీ ప్రతి తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని గుర్తు చేస్తుందని, ఆ సన్నివేశాలు తనకు చాలా ప్రత్యేకం అని ఆయన అన్నారు. ఈ యువతరం నటులు తన పట్ల చూపిన ప్రేమ, గౌరవం తనకెంతో అదృష్టమని ఆయన గర్వంగా చెప్పుకున్నారు.
మానవ సంబంధాలలో “ఇచ్చి పుచ్చుకోవడం” అనే సూత్రం చాలా ముఖ్యమని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. మనం ఎంత ప్రేమను పంచుతామో, అంతే ప్రేమను తిరిగి పొందుతామని ఆయన వివరించారు. ఈ సూత్రం తల్లిదండ్రులు, పిల్లలు, మనవలు, మనవరాళ్ళతో సహా అన్ని బంధాలకు వర్తిస్తుందని ఆయన అన్నారు. తనకు ఈ తరం యువ నటుల నుంచి లభించిన ఆప్యాయత అందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. నాలుగు దశాబ్దాల తన నటనా ప్రస్థానంలో తాను నేర్చుకున్న అతి ముఖ్యమైన పాఠం క్రమశిక్షణ, సమయపాలన మరియు పని పట్ల నిబద్ధత అని రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..
రాజేంద్రప్రసాద్, మహేష్ బాబు ఫోటో..
Rajendra Prasad, Mahesh Bab
ఎక్కువ మంది చదివినవి : Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..