Headlines

Comedian Bhadram: కమెడియన్ డాక్టర్ భద్రమ్ ఏపీకి చెందిన ఆ ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడని తెలుసా? ఫొటోస్ వైరల్ | Somu Veerraju Thanks To Megastar Chiranjeevi For Giving A Key Role To Actor Dr Bhadram In Mega 158 Movie

Comedian Bhadram: కమెడియన్ డాక్టర్ భద్రమ్ ఏపీకి చెందిన ఆ ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడని తెలుసా? ఫొటోస్ వైరల్ | Somu Veerraju Thanks To Megastar Chiranjeevi For Giving A Key Role To Actor Dr Bhadram In Mega 158 Movie


కమెడియన్, నటుడు భద్రమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2015లో జ్యోతి లక్ష్మి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తన నటనతో తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. ఊహలు గుసగుసలాడే, రౌడీ ఫెలో, సూర్య వర్సస్ సూర్య, భలే భలే మగాడివోడ్, మహానుభావుడు, శతమానం భవతి, లోఫర్, పండగ చేస్కో, ప్రతిరోజు పండగే, ఎక్కడికి పోతావు చిన్నవాడా, చావు కబురు చల్లగా, టక్ జగదీష్, జిన్నా, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, అనగనగా ఒకరాజు.. ఇలా దాదాపు 150 సినిమాల్లో నటించి మెప్పించాడు భద్రమ్. సినిమాల సంగతి పక్కన పెడితే భద్రమ్ ఒక ఫేమస్ డాక్టర్ కూడా. హైదరాబాద్‌లో ఎర్గొనోమిక్స్‌ (ఫిజియోథెరపిస్ట్‌) డాక్టర్‌గా తన కెరీర్ ప్రారంభించారు భ్రదమ్. గూగుల్, ఇన్ఫోసిస్‌ లాంటి సాఫ్ట్‌వేర్, ఐటీ కంపెనీలలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా పనిచేస్తూ, దేశవ్యాప్తంగా ఎర్గానామిక్స్‌ ట్రైనింగ్, వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఆరోగ్యానికి సంబంధించి బయట వర్క్ షాపులు కూడా నిర్వహిస్తుంటాడు. అలాగే సోషల్ మీడియాలోనూ ప్రజలకు సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ఆరోగ్యం, వ్యాయామం, యోగా, లైఫ్ స్టైల్ తదితర అంశాలకు సంబంధించిన ఇన్ స్టా గ్రామ్ వేదికగా టిప్స్ ఇస్తుంటారు భద్రమ్. అయితే ఈ నటుడి గురించి చాలా మందికి తెలియని విషయం ఒకటుంది. అదేంటంటే.. భద్రమ్ ప్రముఖ బీజేపీ నాయకుడు సోము వీర్రాజుకు స్వయానా అల్లుడు.


ఇవి కూడా చదవండి



వివరాల్లోకి వెళితే.. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి- డైరెక్టర్ కే.ఎస్.రవీంద్ర (బాబి కొల్లి) కాంబినేషన్ లో ఒక క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కుతోంది. మెగా 158 పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో నటుడు భద్రమ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా మెగా 158లో భద్రమ్ కు ఒక మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రను కేటాయించడం పట్ల ఆయన మామగారు, ప్రముఖ బీజేపీ నాయకులు సోము వీర్రాజు హర్షం ఆనందం వ్యక్తం చేశారు. చిరంజీవిని వ్యక్తిగతంగా కలిసి, ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు సోము వీర్రాజు. అనంతరం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన అల్లుడు భద్రమ్, చిరంజీవితో కలిసున్న ఫొటోను షేర్ చేస్తూ..

సోము వీర్రాజు ట్వీట్..

‘డైరెక్టర్ బాబీ గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న #Mega158 చిత్రంలో హాస్యనటుడు , మా అల్లుడు గారు డాక్టర్ భద్రం గారికి మంచి అవకాశం కల్పించినందుకు గాను, ఈ రోజు గౌరవనీయులు, మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలిసి నా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. కళను, కళాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహించే మీ ఉదార స్వభావం ఎందరికో ఆదర్శం చిరంజీవి గారూ’ అని ట్వీట్ చేశారు సోము వీర్రాజు. దీంతో క్షణాల్లోనే ఈ ట్వీట్ వైరల్ గా మారింది. దీనిని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. భద్రమ్ గారికి ఇంత పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందా? అని కామెంట్స్ పెడుతున్నారు.

నటుడు భద్రం ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *