Headlines

Electrical Safety Tips: వర్షాకాలంలో కరెంట్‌తో జాగ్రత్త.. చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదం! | Electrical Safety Tips During the Monsoon: Essential Precautions to Prevent Accidents

Electrical Safety Tips: వర్షాకాలంలో కరెంట్‌తో జాగ్రత్త.. చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదం! | Electrical Safety Tips During the Monsoon: Essential Precautions to Prevent Accidents


వర్షాకాలంలో తెరిచిన మ్యాన్ హోల్స్‌, పిడుగుపాటుతో పాటు విద్యుత్ ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతుంది. భారీ వర్షాల కారణంగా నివాస ప్రాంతాల్లోని వీధులు, రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండడం చూస్తూనే ఉంటాము. తడిసిన విద్యుత్ పరికరాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు వంటి కారణాలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  1. వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, వీధి లైట్ల స్తంభాల దగ్గరకు వెళ్లకుండా ఉండాలి. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగి నేలపై పడినట్లు కనిపిస్తే వాటిని తాకే ప్రయత్నం చేయకూడదు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. అలాంటి ప్రాంతాలకు పిల్లలను, పశువులను కూడా వెళ్లనివ్వకపోవడం మంచిది.
  2. ఇంట్లో విద్యుత్ పరికరాలను ఉపయోగించే ముందు చేతులు పూర్తిగా పొడిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. తడి చేతులతో స్విచ్‌లు ఆన్ లేదా ఆఫ్ చేయడం ప్రమాదకరం. వైరింగ్ పాతబడినా, స్విచ్ బోర్డులు దెబ్బతిన్నా వెంటనే ఎలక్ట్రిషియన్‌తో మరమ్మతులు చేయించుకోవాలి. ఎర్తింగ్ సరిగా ఉందో లేదో కూడా తరచూ తనిఖీ చేయించాలి.
  3. ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉన్న సమయంలో మొబైల్ ఫోన్‌ను చార్జింగ్‌లో పెట్టి ఉపయోగించడం ప్రమాదకరం. అలాగే విద్యుత్‌తో పనిచేసే పరికరాలను అవసరం లేకపోతే ప్లగ్ నుంచి తొలగించడం సురక్షితం. ఇంట్లోకి వర్షపు నీరు చేరితే మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేసిన తర్వాతే నీటిని తొలగించే ప్రయత్నం చేయాలి.
  4. బయట ప్రయాణించే వారు వర్షపు నీటితో నిండిన ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి. నీటిలో విద్యుత్ లీకేజ్ ఉండే అవకాశం ఉన్నందున ఆప్రాంతాల్లో నడవకూడదు. విద్యుత్ స్తంభాలు, తెగిన తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో నీరు నిల్వ ఉంటే ఆ మార్గాన్ని పూర్తిగా నివారించాలి.
  5. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా విద్యుత్ ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చు. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండటం ద్వారా మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను కూడా సురక్షితంగా కాపాడుకోవచ్చు. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంవహించినా ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదముంది.
  6. ఉరుములు, మెరుపుల సమయంలో, వర్షం కురిసే సమయంలో టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్, డిష్ కనెక్షన్లు ఆప్ చేయడం మంచిది. లేదంటే అవి పాడయ్యే అవకాశముంది.  వాటర్ హీటర్‌ను ఆన్‌లో ఉంచి స్నానం చేయడం కూడా మంచిది కాదు. వర్షాల కురిసే సమయంలో విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల కింద నిల్చోవడం కూడా సరికాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *