Headlines

Elon Musk: ఎలాన్ మస్క్‌ మరో సూపర్‌ ప్లాన్‌.. X Moneyతో యాప్‌లోనే పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు! | Elon Musk Launches ‘X Money’ Banking Services in the US video tv9d – Technology Videos in Telugu

Elon Musk: ఎలాన్ మస్క్‌ మరో సూపర్‌ ప్లాన్‌.. X Moneyతో యాప్‌లోనే పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు! | Elon Musk Launches ‘X Money’ Banking Services in the US video tv9d – Technology Videos in Telugu


ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ మరో సూపర్‌ ఐడియాతో సరికొత్త సేవలను ప్రజలను అందుబాటులోకి తెచ్చారు. ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ మరో భారీ అడుగు వేసింది. ఎక్స్‌ను ‘ఎవ్రీథింగ్ యాప్‌’గా మార్చాలనే మస్క్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో భాగంగా అమెరికాలో పూర్తిస్థాయి బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. ‘ఎక్స్ మనీ’ పేరుతో తీసుకొచ్చిన ఈ సేవలు ప్రస్తుతం ప్రీమియం, ప్రీమియం ప్లస్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు యాప్ నుంచే నేరుగా డిపాజిట్లు చేయడం, ఒక ఖాతా నుంచి మరొకరికి డబ్బు పంపడం, బిల్లులు చెల్లించడం, వైర్ ట్రాన్స్‌ఫర్లు మరియు చెక్కులు పంపడం వంటి అనేక బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించవచ్చు. ఈ డిపాజిట్లను న్యూజెర్సీకి చెందిన ‘క్రాస్ రివర్ బ్యాంక్’ నిర్వహించనుండగా, అమెరికా ఎఫ్‌డీఐసీ ద్వారా 2.5 లక్షల డాలర్ల వరకు బీమా రక్షణ ఉంటుంది. అంతేకాకుండా, ప్రీమియం ప్లస్ సభ్యుల డిపాజిట్లపై ఏటా గరిష్ఠంగా 6 శాతం వడ్డీ అందిస్తామని ప్రకటించడం గమనార్హం. చైనాలోని ‘వీచాట్’ తరహాలో మెసేజింగ్, పేమెంట్స్, షాపింగ్ సేవలను ఒకే చోట అందించడమే లక్ష్యంగా మస్క్ ఈ వ్యూహం పన్నారు. దీని ద్వారా పేపాల్, క్యాష్ యాప్ వంటి దిగ్గజ డిజిటల్ చెల్లింపు సంస్థలకు ‘ఎక్స్’ గట్టి పోటీ ఇవ్వనుంది. కాగా, ఈ అధిక వడ్డీ ఆఫర్‌పై అమెరికా సెనేట్ బ్యాంకింగ్ కమిటీ సభ్యురాలు ఎలిజబెత్ వారెన్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీకు స్మార్ట్ రేషన్ కార్డు కావాలా ?? ఈ ఒక్క పని చేయండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *