Headlines

EPFO: కేవలం 48 గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు.. పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. | EPFO Speeds Up PF Withdrawals: Claims to Be Settled Within 24 to 48 Hours

EPFO: కేవలం 48 గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు.. పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. | EPFO Speeds Up PF Withdrawals: Claims to Be Settled Within 24 to 48 Hours


ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తాజాగా కీలక ప్రకటన జారీ చేసింది. పీఎఫ్ విత్ డ్రా ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి పీఎఫ్ సొమ్ము విత్ డ్రా చేసుకోవడానికి ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. క్లెయిమ్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత కేవలం 24 గంటల నుంచి 48 గంటల్లోపే సెటిల్ చేస్తున్నట్లు తెలిపింది. కొన్ని సందర్భాల్లో అదే రోజు అకౌంట్లలో డబ్బులు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఈ మేరకు పీఎఫ్ క్లెయిమ్స్ సెటిల్మెంట్లలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొంది.

న్యూఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ సమ్మిట్‌లో EPFO ​​సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (CPFC) రమేష్ కృష్ణమూర్తి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పీఎఫ్ విత్ డ్రాలపై కీలక ప్రకటన చేశారు. క్లెయిమ్స్‌ను వేగంగా ప్రాసెస్ చేసేలా చర్యలు చేపట్టామని, సిస్టమ్‌లో మార్పులు చేసినట్లు చెప్పారు. ఇక నుంచి ఆటో సెటిల్మెంట్ విధానంలో క్లెయిమ్స్ ప్రాసెస్ చేస్తామని, దీని వల్ల నగదు పొందేందుకు రోజలు తరబడి వెయిట్ చేయాల్సిన పని లేదన్నారు. విత్ డ్రా కోసం అప్లై చేసుకున్న తర్వాత ప్రాసెస్ వెంటనే స్టార్ట్ అవుతుందని, 24 నుంచి 48 గంటల్లోపే క్లెయిమ్స్‌ను పరిష్కరిస్తామన్నారు. కొత్తగా తీసుకొచ్చిన ఆటో సెటిల్మెంట్ విధానంతో 90 శాతం క్లెయిమ్స్ ఎలాంటి ఆలస్యం కాకుండా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న అన్నీ క్లెయిమ్స్‌ను పరిష్కరించినట్లు పేర్కొన్నారు.

గతంలో PF క్లెయిమ్‌ను ప్రాసెస్ కావడానికి 7 నుండి 10 రోజుల సమయం పట్టేది. ఆటో సెటిల్మెంట్ విధానం అమల్లోకి వచ్చాక ఉద్యోగులకు తమ నిధులు అవసరమైనప్పుడు వాటి కోసం ఇకపై ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. వైద్య అత్యవసర పరిస్థితులు, విద్య, గృహ కొనుగోళ్లు లేదా ఇతర అవసరమైన ఖర్చుల కోసం PFను సులువుగా ఉపసంహరించుకోవచ్చు. గతంలో కంటే చాలా సులభంగా, వేగంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. త్వరలో యూపీఐ ద్వారా పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. క్లెయిమ్స్ ఆమోదం పొందిన అనంతరం వెంటనే యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇది చెల్లింపుల ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించనుంది. భవిష్యత్తులో ఈపీఎఫ్ఓ సేవలను మరింత సులభతరం చేసే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే ఈపీఎఫ్ఓ వడ్డీ పెంచే విషయంపై రమేష్ కృష్ణమూర్తి స్పందించారు. దానిపై స్పందించడం తొందరపాటు చర్య అవుతుందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *