Headlines

Gold Price Today: బంగారం, వెండి కొంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..! | Gold and Silrver rate today 30 july 2026 thursday in Hyderabad, Delhi, Mumbai, Chennai and other cities

Gold Price Today: బంగారం, వెండి కొంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..! | Gold and Silrver rate today 30 july 2026 thursday in Hyderabad, Delhi, Mumbai, Chennai and other cities


Gold, Silver Prices: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఊగిసలాడుతున్నాయి. ఒక రోజు ధరలు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. అయితే ఈ మధ్యంలో ధరలు భారీగానే దిగి వస్తున్నాయి. తాజాగా జూలై 30వ తేదీన స్వల్పంగా దిగి వచ్చాయి. అయితే గత వారం రోజుల్లో 2 వేల రూపాయలకుపైగానే దిగి వచ్చింది. భారతీయులకు పసిడిపై మక్కువ ఎక్కువ. వందల సంవత్సరాల నుంచి భారతీయ సంస్కృతి, సంప్రదాయల్లో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలంకరణ ఆభరణంగానే కాకుండా అత్యవసర సమయంలో ఆదుకునే ఆర్థిక సాధనంగానూ బంగారాన్ని చూస్తారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైన తర్వాత ఆల్ టైమ్ హై స్థాయి నుంచి బంగారం ధరలు భారీగానే దిగివచ్చాయి. ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా పసిడి రేట్లలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. గురువారం బంగారం, వెండి రేట్లు హైదరాబాద్ మార్కెట్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  1. హైదరాబాద్‌: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,500 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,540 వద్ద ఉంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,650 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,540 వద్ద ఉంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,500 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,540 వద్ద ఉంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,500 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,540 వద్ద ఉంది.
  5. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,500 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,540 వద్ద ఉంది.
  6. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,500 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,540 వద్ద ఉంది.
  7. కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,500 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,540 వద్ద ఉంది.
  8. ఇక వెండి విషయానికొస్తే..హైదరాబాద్‌సహా ఇతర నగరాల్లో కిలో వెండి ధర రూ.2,34,800 వద్ద కొనసాగుతోంది.

బంగారం ధరలు ఎందుకు పడిపోయాయి?

అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు సడలడంతో మార్కెట్ వాతావరణం మెరుగుపడింది. చమురు సరఫరా, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు తగ్గడంతో పెట్టుబడిదారులు తిరిగి బంగారం కొనుగోళ్లు ప్రారంభించారు. జూన్ చివరి నుండి బంగారం ధరలు ఔన్సుకు సుమారు $4,000 వద్ద స్థిరంగా ఉన్నాయి. దీనిని మార్కెట్ నిపుణులు బలమైన మద్దతు స్థాయిగా పరిగణిస్తున్నారు. గతంలో బంగారం ఔన్సుకు దాదాపు $5,600 రికార్డు స్థాయికి చేరుకుంది. కానీ అప్పటి నుండి 20 శాతానికి పైగా పడిపోయింది.

రూపాయి బలపడటం వల్ల దేశీయ మార్కెట్లో దిగుమతి చేసుకున్న బులియన్ (బంగారం, వెండి) ల్యాండెడ్ కాస్ట్ తగ్గిందని వ్యాపారులు తెలిపారు. మరోవైపు, బలహీనమైన ప్రపంచ ధోరణులు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయానికి ముందున్న జాగ్రత్త, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మందకొడిగా ఉంచాయి.

22, 24 క్యారెట్ల బంగారం మధ్య తేడా ఏమిటి?

24 క్యారెట్ల బంగారం సుమారుగా 99.9 శాతం స్వచ్ఛమైనది. అందుకే దీనికి అత్యధిక ధర లభిస్తుంది. అయితే ఇది చాలా మృదువుగా ఉంటుంది. అందుకే సాధారణంగా దీనితో ఆభరణాలు తయారు చేయరు. ఆభరణాల కోసం 22 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *