Headlines

Hair Fall control: ఖరీదైన ఆయిల్స్ వద్దు.. కిచెన్‌లో దొరికే ఇదొక్కడి రాస్తే.. ఊడిన జుట్టు సైతం రావాల్సిందే! | How to Stop Hair Fall in Monsoon: Best Onion Juice Home Remedy

Hair Fall control: ఖరీదైన ఆయిల్స్ వద్దు.. కిచెన్‌లో దొరికే ఇదొక్కడి రాస్తే.. ఊడిన జుట్టు సైతం రావాల్సిందే! | How to Stop Hair Fall in Monsoon: Best Onion Juice Home Remedy


వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువవడం వల్ల జుట్టు రాలడం, కుదుళ్లు బలహీనపడటం చాలా సాధారణం. ఈ వాతావరణంలో మాన్సూన్ వల్ల స్కాల్ప్ జిడ్డుగా మారి, చుండ్రు, హెయిర్ ఫాల్ పెరుగుతాయి. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి మీరు ఖరీదైన ఆయిల్స్ వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ మన కిచెన్‌లో దొరికే ఉల్లిపాయ రసంతోనే ఈ సమస్యకు మనం చెక్ పెట్టవచ్చు. అంవును జుట్టు రాలడాన్ని తగ్గించి..జుట్టు పెరుగుదలను పెంచడంతో ఉల్లిపాయ రసం చాలా బాగా పనిచేస్తుంది.

ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించే సరైన విధానం

ఈ ఉపల్లిపాయ రసాన్ని జట్టుకు ఎలా ఉపయోగించాలనే విషయానికి వస్తే.. ముందుగా 1 లేదా 2 తాజా ఉల్లిపాయలను తీసుకుని పొట్టు తీసి, తురుముకోండి లేదా మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయండి. ఆ తర్వాత ఒక కాటన్ గుడ్డ లేదా వడకట్టే జల్లెడ సహాయంతో రసాన్ని పిండి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఒక పత్తి లేదా వేళ్ల సహాయంతో ఈ ఉల్లిపాయ రసాన్ని నేరుగా మీ తల చర్మం, జుట్టు కుదుళ్లకు బాగా పట్టించండి. జుట్టు పొడవు కంటే కుదుళ్లకు పట్టించడం చాలా ముఖ్యం.

మసాజ్ చేయడం:

రసం రాసిన తర్వాత వేలి కొనలతో 5 నుండి 7 నిమిషాల పాటు వృత్తాకారంలో మెల్లగా మసాజ్ చేయండి. దీనివల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీనిని తలలో దాదాపు 30 నుండి 45 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ జుట్టును శుభ్రంగా కడగండి, దీనివల్ల ఉల్లిపాయ వాసన పూర్తిగా పోతుంది.

ఉల్లిపాయలో ‘సల్ఫర్’ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లకు మంచి పోషణనిచ్చి, కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఇది తలపై వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. మాన్సూన్ సమయంలో అయ్యే తీవ్రమైన జుట్టు రాలడాన్ని త్వరగా అరికడుతుంది. కాబట్టి వారంలో రెండు సార్లు మీరు ఈ చిట్కాను పాటిస్తే జుట్టు రాలడం తగ్గి జుట్టు దృడంగా మారతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *