Headlines

Hyderabad: దివ్యాంగ యువకుడికి మరపురాని అనుభూతి ఇచ్చిన మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్..! | Hyderabad: Malkajgiri police fulfill a specially abled person dream of becoming a police officer

Hyderabad: దివ్యాంగ యువకుడికి మరపురాని అనుభూతి ఇచ్చిన మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్..! | Hyderabad: Malkajgiri police fulfill a specially abled person dream of becoming a police officer


దివ్యాంగుడి చిరకాల కోరికను మల్కాజ్‌గిరి పోలీసులు నెరవేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీస్ అధికారి కావాలన్న రాహుల్ అనే యువకుడి కలను నిజం చేస్తూ, మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి అతనికి మరపురాని అనుభూతిని అందించారు.

సోమవారం హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్‌కు రాహుల్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించిన కమిషనర్ సుమతి, ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం తన కార్యాలయంలోకి తీసుకెళ్లి, కమిషనర్ కుర్చీలో కూర్చోబెట్టి కొద్దిసేపు పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అనుభూతిని కల్పించారు.

ఈ సందర్భంగా రాహుల్‌కు పోలీస్ టోపీని బహూకరించిన కమిషనర్ సుమతి, అతనితో కొంతసేపు ఆప్యాయంగా మాట్లాడారు. పోలీస్ యూనిఫామ్‌పై తనకున్న అభిమానాన్ని, పోలీస్ కావాలన్న తన కలను రాహుల్ వ్యక్తం చేయగా, అక్కడి అధికారులు అతడిని అభినందించి ప్రోత్సహించారు.

ఈ ప్రత్యేక కార్యక్రమంతో రాహుల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతని కుటుంబ సభ్యులు కూడా పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటనతో మల్కాజ్‌గిరి పోలీసులు కేవలం చట్ట అమలుకే పరిమితం కాకుండా, మానవత్వం, కరుణ, ప్రజా సేవ పట్ల తమ నిబద్ధతను మరోసారి చాటిచెప్పారని పలువురు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *